25.3 C
New York
Saturday, July 13, 2024

తెలంగాణ జిల్లాలలోని నిరుపేదలు పొట్ట గడుపుకోవడానికి కూలీగా మారారు…

- Advertisement -

తెలంగాణ జిల్లాలలోని నిరుపేదలు పొట్ట గడుపుకోవడానికి కూలీగా మారారు…

అతిపెద్ద విశాలమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా…

రంగారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు.

రంగారెడ్డి అక్టోబర్ 23 వాయిస్ టుడే ప్రతినిధి:


రంగారెడ్డి అక్షాంశరేఖాంశాలు: 17.366°N 78.476°E
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 7,493 కి.మీ² (2,893 చ.మై.హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి.ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి, దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, విమోచనోద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరే రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు ప్రఖ్యాతిగాంచిన జిల్లా.ఈ జిల్లాలో 37 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి.

గణాంక వివరాలు.రంగారెడ్డి జిల్లా
1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది.మండలాల వారీగా చూస్తే సరూర్ నగర్,రాజేంద్రనగర్, మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది.2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.జనాభాతో రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా.

చరిత్ర

తెలంగాణ వేదిక
నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాలలో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలలో సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు. 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది.హైదరాబాదు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడైన కె.వి.రంగారెడ్డి పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు.ఈ జిల్లా ఇంతకు మునుపు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.1978లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి కె.వి.రంగారెడ్డి పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు.తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు.ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.

నిజాం విమోచనోద్యమం
.
1947 ఆగస్టు 15న దేశమంతటా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుండగా హైదరాబాదు సంస్థాన ప్రజలు మాత్రం దాష్టీక రజాకార్ల రాక్షస దురాగతాలకు బలైపోతున్నారు.ఆ సమయంలో అప్పటి అత్రాఫ్-ఎ-బల్దా జిల్లాలో భాగమైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రజలు కూడా నిజాం, రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. మందుముల నర్సింగరావు, కాటం లక్ష్మీనారాయణ, గంగారం లాంటి ఉద్యమకారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. శంషాబాదు ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్తో కలిసి నిజాం నవాబునే హత్యచేయడానికి వ్యూహంపన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు.

భౌగోళిక స్వరూపం

మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో రంగాపూర్ అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గరగా ఉంది.రంగారెడ్డి జిల్లా 16°30′ నుండి 18°20′ ఉత్తర అక్షాంశం, 77°30′ నుండి 79°30′ తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది. జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.ఈ జిల్లాలో మూసీ నది ప్రవహిస్తుంది

ఆర్ధిక స్థితి గతులు.
వ్యవసాయం, పంటలు

ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వలన, వీరి ప్రధాన వృతి వ్యవసాయం.జిల్లాలో పండించే ప్రధానపంట వరి. ఖరీఫ్, రబీలలో కలిపి 77వేల హెక్టార్లలో వరిపంట సాగవుతుంది. రెండోస్థానంలో ఉన్న జొన్న పంట రెండు కాలాలలో కలిపి 44వేల హెక్టార్లలో పండించబడుతుంది. కందులు ఖరీఫ్‌లో 28వేల హెక్టార్లలో సాగుచేయబడుతుంది. తాండూరు ప్రాంతం కందులకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందినది. వేరుశనగ రబీలో 7వేల హెక్టార్లలో పండుతుంది. మండలాల వారీగా చూస్తే వరిపంట హయత్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాలో అత్యధికంగా సాగుఅవుతుంది. జొన్న పంట ఉత్పత్తిలో బషీరాబాదు, మర్పల్లి, వికారాబాదు మండలాలు ముందంజలో ఉన్నాయి. కందిపంట తాండూరు, యాలాల, బషీరాబాదు మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. మొక్కజొన్న సాగులో చేవెళ్ళ, శంషాబాదు, మొయినాబాదు మండలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చెరుకు పంట బంటారం, పెద్దెముల్ మండలాలలో ఎక్కువగా సాగుచేయబడుతుంది. పండ్ల ఉత్పత్తిలో కందుకూరు మండలం, కూరగాయల ఉత్పత్తిలో చేవెళ్ళ, శంకర్‌పల్లి మండలాలు, పూలఉత్పత్తిలో శంకర్‌పల్లి మండలం ముందంజలో ఉన్నాయి.

నీటిపారుదల

జిల్లాలో రెండూ నదులు ప్రవహిస్తున్ననూ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేవు. మొత్తం సాగువిస్తీర్ణంలో కేవలం 30% విస్తీర్ణానికే నీటిపారుదల సౌకర్యం ఉంది. హిమాయత్ సాగత్, ఉస్మాన్ సాగర్ చెరువులున్ననూ అవి ప్రధానంగా త్రాగునీటికే ఉపయోగపడుతున్నాయి. కాగ్నానదిపై నిర్మించిన కోట్‌పల్లి ప్రాజెక్టి మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుగా సుమారు 3700 హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది. జుంటుపల్లి ప్రాజెక్టు, లక్నాపూర్ ప్రాజెక్టులు రెండు కలిపి సుమారు 1800 హెక్టార్లకు నీరు అందిస్తున్నాయి.

పరిశ్రమలు..

హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మండలాలలో పలు భారీ, అనేక మధ్యతరహా పరిశ్రమలే కాకుండా పలు పారిశ్రామిక వాడలున్నాయి. రాష్ట్ర పారిశ్రామికరంగంలో పేరుగాంచిన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎంటీ, ఎన్‌ఎఫ్‌సీ లాంటి పరిశ్రమలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి.ఇవే కాకుండా చెర్లపల్లిలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్, కుత్బులాపూర్ మండలంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ, జీడీమెట్లలో ఈక్విస్ ఇంజనీర్స్, మేడ్చల్‌లో జీటీ అల్మాక్స్, తుర్కపల్లి, బోడుప్పల్‌లలో జీవీకే బయోసైన్స్, ఉప్పల్‌లో హెరిటేజ్ ఫుడ్స్, మౌలాలీలో హిందుస్తాన్ కోకాకోలా బెవెరేజెస్, గుండ్లపోచంపల్లిలో ఇంటగ్రేటెడ్ ఫార్మాసీటికల్స్ ఉన్నాయి. జీడీమెట్ల, బాలానగర్, ఉప్పల్ లలో భారీ, మధ్యతరహా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. .

ఖనిజ సంపద

రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.

పరిపాలనా విభాగాలు

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణ తరువాత ఈ జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు రాజేంద్రనగర్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూర్ చివరి మూడు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి. 27 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 33 తో కలుపుకొని 604 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలోని మండలాలు.
రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు రంగారెడ్డి జిల్లాలోని మండలాల గ్రామాల నుండి, కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.
హయాత్‌నగర్‌ మండలం
ఇబ్రహీంపట్నం మండలం
మంచాల్‌ మండలం
యాచారం మండలం
శేరిలింగంపల్లి మండలం
రాజేంద్రనగర్ మండలం
శంషాబాద్ మండలం
సరూర్‌నగర్‌ మండలం
మహేశ్వరం మండలం
కందుకూర్‌ మండలం
శంకర్‌పల్లి మండలం
మొయినాబాద్‌ మండలం
షాబాద్‌ మండలం
చేవెళ్ళ మండలం
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం*
గండిపేట్ మండలం*
బాలాపూర్ మండలం*
మాడ్గుల్ మండలం
కొత్తూరు మండలం
ఫరూఖ్‌నగర్ మండలం
కేశంపేట మండలం
కొందుర్గు మండలం
ఆమన‌గల్ మండలం
తలకొండపల్లి మండలం
నందిగామ మండలం.
చౌదర్‌గూడెం మండలం.
కడ్తాల్ మండలం.పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు
స్థానిక స్వపరిపాలన సంస్థలు
నియోజక వర్గాలు
పునర్య్వస్థీకరణ ముందు రంగారెడ్డి జిల్లా మండలాలు
రవాణా వ్వవస్థ
అడవులు
విద్యాసంస్థలు
పర్యాటకం
క్రీడలు
ప్రముఖవ్యక్తులు
జిల్లా రాజకీయాలు
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
యర్రా రామారావు చివరిసారి నెలల క్రితం దిద్దుబాటు చేసారు.
రిలేటెడ్ పేజెస్
చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్ సభ నియోజకవర్గం.మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం
వికారాబాదు జిల్లా
తెలంగాణ లోనిదే రంగారెడ్డి జిల్లాకు ఇంతటి చరిత్ర కలిగి ఉన్నది

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!