- Advertisement -
గత ప్రభుత్వంలో ఐటి కంపెనీల్లో కూడా వాటాలు అడిగారు!
The previous government also asked for shares in IT companies!
అయిదేళ్లలో 5లక్షల ఐటి ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం
కేంద్ర డాటా పాలసీ ఖరారైతే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు
3నెలల్లో విశాఖపట్నంలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభం
శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి:
గత ప్రభుత్వంలో కొందరు ఐటి కంపెనీల్లో కూడా వాటాలు అడగడంతో వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధిపై శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… రాష్ట్ర విభజన తర్వాత ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్లారు. అందులో భాగంగా విశాఖలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఐటిరంగంలో 20శాతం మంది తెలుగువారు ఉండటం హర్షణీయం. 2014-19 నడుమ రాష్ట్రానికి దాదాపు 150 కంపెనీలు రావడంతో 50వేలమందికి ఉపాధి లభించింది. డాటా సెంటర్ ను రప్పించేందుకు అప్పట్లో అదానీతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో ఐటి రంగం ప్రముఖులతో కాంక్లేవ్ పెట్టాం. ఐటి రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో గత ప్రభుత్వం చర్యలతో బ్రేక్ పడింది. గతప్రభుత్వంలో ఒక మంత్రి కోడిగుడ్డు కథలతో రాష్ట్రాన్ని నవ్వుల పాల్జేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా ఐటి కంపెనీల్లో వాటాలడిగారు. నాటి ప్రభుత్వ అనాలోచిత చర్యలతో నిక్సీ, ఎస్ టిబిఐ వెళ్లిపోయాయి. ఫలితంగా ఎపి యువత నష్టపోయింది. గత అయిదునెలల్లో ఐటి కంపెనీలు, ఐటా ప్రతినిధులతో మాట్లాడాను. తమ కృషి ఫలితంగా త్వరలో విశాఖకు టిసిఎస్ రాబోతోంది. మూడునెలల్లో టిసిఎస్ విశాఖలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీంతోపాటు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు కూడా వారు ఒప్పకున్నారు. ఇన్ఫోసిస్ సంస్థను కూడా క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరా. ఇందుకు అవసరమైన భూముల కోసం వెదుకుతున్నాం. ఆరునెలల్లో కొబ్బరికాయ కొడతాం. ముఖ్యంగా ఐటి పరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐటి రంగంలో రాబోయే 5ఏళ్లలో 5లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం.
- Advertisement -