- Advertisement -
పెన్షనర్ల సమస్యలను పరిష్కారం చేయాలి.
The problems of pensioners should be resolved.
కమాన్ పూర్
సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పలువురిని కలవడం జరిగిందని అధ్యక్షుడు గౌతమ్ శంకరయ్య తెలిపారు.
సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఎంఎస్ఎస్ అనుబంధ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియషన్ సెక్రటరీ యం రమాకాంత్ మరియు బి ఎం ఎస్ సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
ని కలిసి సింగరేణి ఫెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు పోవడం జరిగింది. అనేక నష్టాలతో సతమతమవుతూ ఉన్న సింగరేణిని,ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి యాజమాన్యం యొక్క ఆదేశాలతో పని చేసి తెలంగాణ అభివృద్ధి లో భాగస్వామ్యం మయి భారత దేశానికి వెలుగులు ఇచ్చి మరియు అనేక లాభాలు వచ్చే విధంగా 30నుండి 40 సంవత్సరాలు సింగరేణి లో పనిచేసి పదవిరమణ పొందిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు చాలి చాలని పెన్షన్ మరియు సరియిన వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియ చేస్తూ ఈ క్రింది సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది.
పాల్గొన్న వారు సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షలు గౌతం శంకరయ్య,ప్రధాన కార్యదర్శి పట్నం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వేగోలపు మల్లయ్య,సంయుక్త కార్యదర్శి తోట మొండయ్య,ట్రెసరర్ వంగా రాజసమ్మయ్య,
నాయకులు కొండ సమ్మయ్య,ప్రతాప్ రెడ్డి,కి పి యచ్ ఐలయ్య,నూనె రాజేశం,వేపచెట్టు రాజయ్య, బండారి రాజయ్య,k. సంపత్ కుమార్,మంతిని పోషం పాల్గొన్నారు.
- Advertisement -



