- Advertisement -
బాధితుల సమస్యలను తక్షణమే చట్టపరిధిలో పరిష్కరించాలి
The problems of the victims should be resolved immediately within the ambit of law
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ డిసెంబరు 16, సోమవారం నాడు నిర్వహించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ గారు ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలోచర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 38 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 14, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, మోసాలకు పాల్పడినట్లుగా 8, ఇతర అంశాలకు సంబంధించినవి 12 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7 దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి,డిసిఆర్బి సిఐ శంకరరావు, ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -