Sunday, September 8, 2024

రాజకుటుంబీకుల ఆస్తులు ప్రభుత్వాలు ఆధీనంలోకీ తెచ్చుకోవాలి

- Advertisement -

రాజకుటుంబీకుల ఆస్తులు ప్రభుత్వాలు ఆధీనంలోకీ తెచ్చుకోవాలి
మాజీ శాసన సభ్యులు గోనె ప్రకాశరావు
న్యూ ఢిల్లీ జనవరి 5
కర్ణాటక,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ శాసన సభ్యులు గోనె ప్రకాశరావు పేర్కొన్నారు. త్వరలో సోనియాగాంధీని కలుస్తానన్నారు. రాజకుటుంబీకుల ఆస్తులు రెండు రాష్టాల్లో ఉన్నాయన్నారు. రాజ కుటుంబీకులు చనిపోయి వారి వారసులు మైనర్‌లు అయినప్పుడు వారి ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్నారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు అన్యాయంగా ఆక్రమించుకున్నారన్నారు. బ్రిటీష్ కాలం నాటి కోర్ట్ ఆఫ్ ఆర్డర్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని గోనె ప్రకాశరావు పేర్కొన్నారు.‘‘కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులను తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు ఆధీనంలోకీ తెచ్చుకోవాలి. రాజ కుటుంబీకుల వారసులు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వారి ఆస్తులు రిలీజ్ చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రైవేటు వ్యక్తులు లక్షల కోట్ల ఆస్తులను దోచుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చిచ్చర పిడుగు. ఆయన మంచి పాలన అందిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న రాజకుటుంబీకుల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి స్వాధీనం చేసుకోవాలి.
క్లెయిమ్ చెయ్యని రాజకుటుంబీకుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటే రాష్ట్రప్రభుత్వానికి ఆర్ధిక కష్టాలు తీరే అవకాశం ఉంది. కోర్టు ఆఫ్ ఆర్డర్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆర్ధికంగా లాభదాయకం. రాజకుటుంబీకుల ఆస్తుల డాక్యుమెంట్లను మాయం చేసి ప్రైవేటు వ్యక్తులు వారి ఆస్తులను కొట్టేశారు. లంగాణ, కర్నాటక ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే వారికి సహాయం చెయ్యడానికి కొంత మంది రాజకుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు. కు రేవంత్ రెడ్డి సమయం ఇస్తే అన్ని వివరాలను నేను ఆయనకు చెబుతాను.రాజకుటుంబీకుల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల నుంచి విడిపిస్తే దానికి ప్రతిఫలంగా వారు రాష్ట్రప్రభుత్వ పథకాలకు తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తారు’’ అని గోనె ప్రకాశరావు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్