Sunday, September 8, 2024

ఎన్నికల నిర్వహణకు మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం

- Advertisement -

నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్, మిథిలేష్ మిశ్రా

నాగర్ కర్నూల్:  జిల్లా పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించడంలో  మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కేంద్ర  ఎన్నికల సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్, మిథితీష్ మిశ్రాలు అన్నారు.

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం మైక్రో అబ్జర్వర్లకు ఓటింగ్‌పై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా నాగర్ కర్నూల్  సాధారణ పరిశీలకులు మితిలీష్ మిశ్రా మాట్లాడుతూ…..

స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంతో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతి  అంశాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలో నిర్ణయాత్మకంగా ఉంటుందన్నారు.  జిల్లాలోని 210 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు ను ఎన్నికల సంఘం నియమించిందన్నారు.   సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5.30 కి మాక్ పోలింగ్ నిర్వహణ అలాగే మాక్ పోలింగ్ 50 ఓట్లు వేశారా లేదా పరిశీలన చేయాలని సూచించారు. 29వ తేదీ రోజునే మికు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ముందుగా పోలింగ్ కేంద్రాల మౌలిక వసతులను పరిశీలన  చేయాలని సూచించారు.  30వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ నుంచి పూర్తి సాయి  పోలింగ్ పూర్తి అయ్యేవరకు  సూక్ష్మస్థాయిలో పరిశీలన చేసిన అంశాలను  అనెక్సర్ 28 లో నమోదు చేసి అదే రోజు రాత్రి రిసీవింగ్ సెంటర్లో నేరుగా జనరల్ అబ్జర్లకు అందజేయాలని సూచించారు.  పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం కావాలని ఏదైనా కారణాలతో ఉదయం 8  గంటల వరకు కూడా వెంటనే తమకు తెలియపరచాలన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకుంటే అట్టి పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.  మాకు పోలింగ్ ప్రారంభమయ్యేప్పటినుండి పోలింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఈవీఎంలను తరలించేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలను  ఆయన అవగాహన కల్పించారు.  కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గాల  మరో సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ…… మైక్రో అబ్జర్వర్ల పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లో జరిగే పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడానికి నియమించడం జరుగుతుందని, బూత్ లో ప్రతి  అంశాన్ని పరిశీలన చేయాలని సూచించారు.  పి.ఓ డైరీ లో అన్ని సంఘటనలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా పరిశీలన చేయాలని అలాగే ఎంత మంది పోలింగ్ ఏజెంట్లు హాజరు అయినది లేనిది

తప్పక చూడాలని అన్నారు. ముఖ్యంగా ఈవీఎంలు సరిగా అనుసంధానం చేశారా మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ బటన్ నొక్కరా లేదా పరిశీలన చేయాలని సూచించారు.  ఓటర్ ఐడి కార్డుల తో వచ్చి ఓటు  వేస్తున్నారా పరిశీలన చేయాలని అన్నారు. ఈవీఎంలు పద్ధతి ప్రకారంగా సీల్ చేసారా లేదా చూడాలని అన్నారు. 17ఏ సరిగా రాస్తున్నారా అలాగే 17సి ఏజెంట్లకు ఇచ్చారా పరిశీలన చేయాలని తెలిపారు.  పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించబడినవా లేదా పరిశీలన చేయాలని సూచించారు. అనంతరం ఈవీఎంల నిర్వహణ పనితీరుపై ఈవీఎం ట్రైనర్ రాఘవేందర్ శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో శిక్షణ పర్యవేక్షణ నోడల్ అధికారి నర్సింగ్ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్