Thursday, April 24, 2025

గులాబీ దండు కదం తొక్కాలి…ఓరుగల్లు దద్దరిల్లాలి…

- Advertisement -

గులాబీ దండు కదం తొక్కాలి…ఓరుగల్లు దద్దరిల్లాలి…

The rose garden should be planted... the walls should be broken...

= కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి.

= 25 వసంతాల గులాబీ జాతర  విజయవంతం చేయండి.

= రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్.

, గోదావరిఖని
:

గులాబీ దండు కదం తొక్కాలి…ఓరుగల్లు దద్దరిల్లాలి… కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి… 25 వసంతాల గులాబీ జాతరను   విజయవంతం చేయాలని  రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్  పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా బుధవారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గం పార్టీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నో అవమానాలు…
మరెన్నో అవహేళనలు…
అన్నిటినీ అధిగమించి… తొలి సిఎం కేసీఆర్‌  నాయకత్వం లో
స్వరాష్ట్రాన్ని సాధించి…
4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి.
సగర్వంగా నిలిపింది  గులాబీ జెండా అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి, ప్రజలను కదిలించి ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోక ఆగమాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిందని, అధికారం కోల్పోయినా ప్రజల వెంటనే ఉంటోందని, తమకు ఓట్లు వేయలేదని ప్రజ లను ఏనాడు పట్టించుకోకుండా ఉండలేదన్నారు. కేసీ ఆర్, బీఆర్ఎస్ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి 25 వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భారీ బహిరంగ సభకి..
రామగుండం నియోజకవర్గం లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి వెళ్లాలి.

రేవంత్ రెడ్డి పాలన  పెయిల్ అయిందని .. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేశారు..  భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పెడుతున్నారని మూగ జీవాలు గొస  రేవంత్ రెడ్డిని తగులుతుందన్నారు.
రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని స్దానిక  కాంగ్రెస్ పార్టీని నిలదీస్తే  నాపైన, మా పార్టీ నాయకుల పైన 12 కేసులు పెట్టించారన్నారు. ఎన్ని కేసులు పెట్టిన, ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుంటుపడిపోయింది. పూర్తిగా గాడి తప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీలేదు. పాలనపై ప్రజలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నరు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలను నమ్మి తాము మోస పోయామని భావిస్తున్నరు. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. ఈ నెల 27న మన ఇంటి పార్టీ పండుగకు
స్వచ్ఛందంగా తరలుదాం.. విజయవంతం చేద్దామని
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి నడిపెల్లి మురళీధర్ రావు పెంట రాజేష్ జె.వి. రాజు గోపు అయులయ్య పాముకుంట్ల భాస్కర్ రమణారెడ్డి కల్వచర్ల కృష్ణ వేణి రాకం వేణు కుమ్మరి శ్రీనివాస్ జనగాన కవిత సరోజినీ అచ్చే వేణు నూతి తిరుపతి చెలకలపల్లి శ్రీనివాస్ మేడి  సదానందం జక్కుల తిరుపతి మేతుకు దేవరాజ్  ముద్దసాని సంధ్యా రెడ్డి గుంపుల లక్ష్మి  సట్టు శ్రీనివాస్ బుర్ర వెంకన్న రామరాజు నీరటి శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ కొడి రామకృష్ణ చింటూ ఆవునూరి వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్