Sunday, September 8, 2024

రాష్ట్రాన్ని శాసించే కులం మున్నూరుకాపు కులం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

- Advertisement -

కాపులు కాంగ్రెస్ పార్టీకి “కాపు” కాచే సమయం ఆసన్నమైంది.

నాగలి దున్నే మనం పౌరుషం,పట్టుదలతో ఉండాలి.

మున్నూరుకాపు సంఘం జిల్లా,రాష్ట్ర నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు,పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

 

నియంతృత్వ,అప్రజాస్వామిక పాలనను తరిమి కొట్టేందుకు
కాపులు కాంగ్రెస్ పార్టీకి “కాపు” కాచే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ
ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం నగరంలోని
ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్ లో ఆదివారం ఖమ్మం జిల్లా మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం పసుపులేటి దేవేందర్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిసిసి జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,సిటీ అధ్యక్షులు జావీద్,టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ,పెద్దిరెడ్డి రాజా పాల్గొన్నారు.

ఈసందర్భంగా మున్నూరుకాపు లను ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
కాపులు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీని కాపు కాస్తున్న వ్యక్తులని అన్నారు.ఇప్పుడు
మమ్ములను కాపుకాయాల్సిన పరిస్థితి ఆసన్నమైందన్నారు.
నాగలి దున్నుకునే మనం పౌరుషం,పట్టుదలతో ఉంటామని అన్నారు.
అవిలేకపోతే మనకు మనుగడ ఉండదన్నారు.
మట్టిపిసుకున్నే మన జాతి భయనికో,భయపడితేనో బేదిరే జాతి కాదన్నారు.
వెంగళరావు సీఎంగా ఉన్నప్పటి నుంచి మా కుటుంబం కూడా కాంగ్రెస్ లోనే ఉండేదని తుమ్మల గుర్తు చేశారు.
మంచి కోసం,ప్రజల కోసం,అభివృద్ధి కోసమే మితోటి రాజకీయాలు చేసే వాడినే తప్ప వేరే రాజకీయాలు తెలియవని తుమ్మల చెప్పారు.మీ అందరి దయవల్ల 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండగలిగనని తెలిపారు.అన్ని వర్గాల ఆశీస్సులు నాపై ఉండబట్టికే ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు.గతంలో ఏపార్టీలో పని చేసిన, శత్రువు పై ఈగ వాలకుండా 40 ఏళ్లపాటు రాజకీయ జీవితం గడిపానని చెప్పారు.జిల్లాలో ఏవొక్కరుకుడా,నా వల్ల నష్టం జరిగిందోనని,కష్టం వచ్చిందని చెప్పే పరిస్థితి లేదన్నారు.చేతనైతే సహాయం చేస్తా,ఆప్రాంతానికి కావలసిన మౌలిక వసతుల కృషి కొరకు నా అధికారాన్ని వాడతాను తప్ప,ఎప్పుడు నా స్వార్థం కోసం,అహంకారంతో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని తుమ్మల గుర్తు చేశారు.
మిపై నా మునుషులు కానీ,నేను అధికారంలో ఉన్నప్పుడూ ప్రతిపక్షాలను మాట కూడా అననివ్వలేదన్నారు.
భవిష్యత్ లో కూడా అదే పద్ధతి కొనసాగిస్తానని తెలిపారు.అత్యధిక జనాభా ,చైతన్యం కలిగిన బీసీ కులమని తెలిపారు.అధికారం ఇవ్వాళ ఉండొచ్చు,పోవొచ్చు
పదవులు రావొచ్చు,పోవొచ్చు కానీ ప్రజానీకానికి చేసిన సేవ ఎప్పటికి గుర్తుంటోందన్నారు.
మున్నూరుకాపు లకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికి ప్రాధాన్యత ఉంటదని చెప్పారు.అందరికి సముచిత స్థానం ఉండేలా ప్రయత్నం ఉంటోందన్నారు.
పాలేరు,ఖమ్మం నియోజకవర్గాలు మాత్రమే కాదు,పది సీట్లలో పది స్థానాలు గెలిపించాలని కోరారు.

రాష్ట్రాన్ని శాసించే కులం మున్నూరుకాపు కులం.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం,
రాష్ట్రాన్ని శాసించగలిగే కులం మున్నూరుకాపు కులమని పొంగులేటి అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అది చేశాం,ఇది చేశామని కథలు చెప్పడం తప్ప…చెప్పినంత చేసినదేమి లేదన్నారు.
మున్నూరుకాపు లో ప్రధమ నాయకుడి పుట్టినరోజు,తన కుమారుడి వివాహం సందర్భంగా ప్లెక్సీలు చించి వేసిన ఘటనను,అడ్డంకులు సృష్టించిన విషయాలను
మర్చిపోవద్దన్నారు.
వానలు కురవడంతోనే వాతలు మరువొద్దు,వానలు కురవడంతోనే గతంలో మీకు పెట్టిన వాతలు మర్చిపోవద్దని హితవుపలికారు.
మీకు పెట్టిన వాతలకు, వాతలు పెట్టె సరైన సమయం ఆసన్నమైందని తెలిపారు.కులాన్ని రెచ్చగొట్టి వాడుకోవాలని చూస్తున్న వారికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు.డిసెంబర్ 10న తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరడిగే న్యాయబద్ధమైన
మున్నూరుకాపు కార్పొరేషన్ ను, మీ సామాజిక వర్గానికి రావాల్సిన పదవులను కల్పించడంలో నేను,తుమ్మల కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు.మున్నూరుకాపు లీడర్లు నాతోనే ఉన్నారని,జబ్బలు చారుచుకునే నాయకులకు, మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పాలని పొంగులేటి పిలుపునిచ్చారు.

తొలుత ఆత్మీయ సమ్మేళనంలో
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు డిసిసి జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సమక్షంలో
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు, ముదిగొండ బిఆర్ఎస్ పార్టీ విభాగం కు చెందిన వేల్పుల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నుంచి కనపర్తి ఉషారాణి లకు కాంగ్రెస్ పార్టీ పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు.

అనంతరం మున్నూరుకాపు ల ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ ఆత్మీయ సమావేశంలో మున్నూరుకాపు జిల్లా,రాష్ట్ర నాయకులు పొదిల రవికుమార్,కొత్తా సీతారాములు,కల్లూరి సోమనాధం, తాళ్లూరి హన్మంతరావు, సముద్రాల శ్రీను,కనిశెట్టి నర్సయ్య,నరాల నరేష్,సంపటి నరసింహారావు, గంగిశెట్టి శ్రీనివాసరావు, మున్నూరుకాపు జిల్లా మహిళావిభాగం అధ్యక్ష,కార్యదర్శులు పగడాల మంజుల,పసుపులేటి లక్ష్మీ,ప్రసన్న,సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజల రాణి,గోవింద్ శ్రీనివాసరావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు,గడల నరసింహారావు,యాస మునీశ్వరరావు,రాం శెట్టి మనోహర్ నాయుడు,కట్ల రంగారావు, సముద్రాల సత్యం,మూలాగుండ్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్