అధికార పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఓటమి భయం వెంటాడుతోంది

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెడుతున్నారు: మధుయాష్కీ

ఎల్బీనగర్ నవంబర్ 30:  అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన వనస్థలిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయం వెంటాడుతుండడంతో అధికార పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అడ్డదారులు వెతుకుతున్నారనన్నారు. అలాగే పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తున్న తనను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలింగ్ భూతుల వద్ద పోలీసులు.. కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులంతా సుధీర్ రెడ్డికి చెంచాగిరి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular