Sunday, September 8, 2024

సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ షూటింగ్ పూర్తి

- Advertisement -

సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ షూటింగ్ పూర్తి

సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు చేయగా.. అది ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది.ఈ చిత్రానికి ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్నారు. దాము న‌ర్రావుల‌ కెమెరామెన్‌గా, మ‌ధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
న‌టీన‌టులు:
య‌శ్విన్‌, దినేశ్ తేజ్‌, అజ‌య్‌, బాలాదిత్య‌, పూజితా పొన్నాడ‌, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్‌ త‌దిత‌రులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్