Sunday, September 8, 2024

ఆరు గ్యారంటీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి : కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్య

- Advertisement -

ఆరు గ్యారంటీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి
: కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్య.

భద్రాచలం, నవంబర్ 12
(వాయిస్ టు డే )
మిత్రపక్షాలను కలుపుకొని కాంగ్రెస్ నాయకత్వం ప్రజల్లో ప్రచారం చేయాలని భద్రాచలం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పేర్కొన్నారు.
ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
నూతనంగా కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులను పరిచయం చేశారు. అన్ని పోలింగ్ బూత్ ఏరియాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతనంగా పార్టీలో చేరినటువంటి వారిని కూడా కలుపుకొని ప్రచారం నిర్వహించాలని సూచించారు. మిత్రపక్షాల కార్యకర్తలను కూడా కలుపుకొని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు.
ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తనకు వస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక, సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీరయ్య ఆరోపించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. బిఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన కోరారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తన విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో
డిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరెల రవికుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్, తమ్ముళ్ల వెంకటేశ్వర్లు,బత్తుల తిరుపతయ్య,ఎన్.ఎస్.యు.ఐ డివిజన్ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,చెంచు సుబ్బారావు, రాసమల రాము,టిడిపి నాయకులు కుంచాల రాజారాం, కోనేరు రాము,చిట్టిబాబు, మాజీ సర్పంచ్ భూక్య శ్వేత,మాజీ ఎంపీపీ ఊకే శాంతమ్మ,ఎస్.కె అజీమ్,మహిళా కాంగ్రెస్ నాయకులు పందాల సరిత,వసంతాల రాజేశ్వరి,తుమ్మల రాణి, ఒంగోలు దేవకి,ఎండి ముంతాజ్, జెంజం దేవి,పుట్ట జానకిరాణి,గౌరీ, జగ్గా కుమారి,రూపా దేవి,సోంపాక నీరజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్