- Advertisement -
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానం
The solution of public problems is the main thing
మంగళగిరి
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గోన్నారు. జనవాణిలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్… ప్రతి ఒక్క అర్జీని నిశితంగా పరిశీలించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని అన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేసారు.
- Advertisement -