కన్నవాళ్లను గెంటేసిన కొడుకు.
The son who chased the parents.
ఆర్డీవోను ఆశ్రయించిన వృద్ధ తల్లిదండ్రులు,కేసు నమోదు.
జగిత్యాల
కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు.గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధ తల్లిదండ్రులు జేరిపోతుల అంజయ్య(72),వజ్రమ్మ(70) లను వారు అప్పులు చేసి కట్టిన ఇంటి లో నుంచి చిన్న కొడుకు శ్రీరామ్ గెంటి వేశాడని , బలవంతంగా వారు నివసిస్తున్న ఇంటిని చిన్న కొడుకు తన పేరిట మార్పు చేయించుకున్నాడని,ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వడం లేదని జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చి సీనియర్ సిటిజెన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను ఆశ్రయించారు.ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.తాము తమ చిన్న కొడుకు కోసం అప్పు తెచ్చిన రూ.5లక్షల 90 వెయ్యిలు సైతం అతను కట్టడం లేదని ,చిన్న కొడుకు,కోడలు తరుచుగా హింసలకు గురిచేసున్నారని ఆర్డీవోకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు .ధీంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదు పై వయోవృద్ధుల సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4 (1),సెక్షన్ 24 ల కింద కేసు నమోదు చేసినట్లు ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి తఫజుల్ హుస్సేన్ తెలిపారు. సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కౌన్సెలింగ్ సభ్యుడు వేల్ముల ప్రకాష్ రావు,సంరక్షణ చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ,లు పాల్గొన్నారు.