మహబూబ్ నగర్, డిసెంబర్ 12: ఎట్టకేలకు ఓ నరరూప రాక్షసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11మందిని పొట్టనబెట్టుకున్నాడు దుర్మార్గుడు. అత్యంత దారుణమైన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నర హంతకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. గద్వాల జోన్ డీఐజి ఎల్ఎస్ చౌహాన్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం, ఎవరైనా ఎదురు తిరిగితే మట్టుబెట్టడం, ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ యాదవ్ అమాయకులైన ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు. తన మంత్రశక్తితో గుప్త నిధులను వెలికితీస్తానని నమ్మబలికాడు. తనకు పరిచయమైన వారిని నమ్మించి, వారి పేరిట ఉన్న భూములు, ఆస్తిపాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా హత్యకు తెగబడతాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడు. ఇలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తిని చంపగా, ఆ కేసు విచారిస్తుండగా పోలీసులకు ఈ కిల్లర్ సత్యం అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి..ఒక హత్య కేసుతో ఈ తాంత్రికుడి డొంక అంతా కదిలింది. 11 మందిని∙పొట్టన పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్‌ని ఎట్టకేలక అరెస్ట్ చేశారు పోలీసులు. సత్యనారాయణ ఇప్పటి వరకు 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడి నుంచి పాయిజన్ బాటిట్స్, బాధితుల ఫోన్లు, 10 సిమ్‌కార్డులు సీజ్ చేశారు. 2020 నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నాడు సత్యనారాయణ. ఈ సీరియల్ కిల్లర్ హత్యల గురించి మరింత లోతుగా విచారిస్తున్నామని గద్వాల జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేశాం. నిందితుడి నుంచి విషపదార్థాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఫోన్లు, సిమ్ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిలో గుప్త నిధుల పేరుతో నమ్మించి కిరాతకంగా హత్యలు చేశాడు. కర్ణాటకలోని బలగనూరు, ఎపీలోని అనంతపురం జిల్లాల్లోనూ హత్యలు చేశాడు.
బయట పడిన నరరూప రాక్షసుడి కధ
Published By Voice Today Team
218
- Advertisement -
- Advertisement -
- Tags
- big twist in mahabubnagar lovers
- jogulamba gadwal
- mahaboobnagar
- mahaboobnagar brutal mother incident
- mahabubnagar
- mahabubnagar attacks
- mahabubnagar brutal mother
- mahabubnagar brutal mother incident
- mahabubnagar brutal mother news
- mahabubnagar district
- mahabubnagar incident
- mahabubnagar lovers attack case
- mahabubnagar lovers in ps
- mahabubnagar lovers story
- mahabubnagar news
- mahabubnagar sirisha latest incident
- palamuru in mahaboobnagar district



