హక్కుల సాధన కోసమే సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె.
The strike of cement factory workers is for the pursuit of rights.
పర్మనెంట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి.
కమాన్ పూర్
సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల హక్కుల సాధన కోసమే సమ్మె చేయడం జరుగుతుందని బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు.
కెసోరాం సిమెంట్ కర్మాగారంలో సోమవారం కార్మికులు సమ్మె ప్రారంభించారు. కార్మిక నాయకులు పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్
మెరుగైన బోనస్ ఇవ్వాలని గత నెల రోజులుగా పలు దఫాలుగా చర్చలు జరిపి ,పది రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటిన తరుణం లో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి హామీలు ఇస్తూ , మాట తప్పుతూ కార్మికులకు న్యాయం చేయడం లేదు ..మెరుగైన బోనస్ చెల్లించడం లేదు.కార్మికుల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ,నాయకత్వ పోరాటాలకు సైతం పూర్తి స్థాయిలో స్పందించని తరుణం లో ఈరోజు ఉదయం 6 గంటలకు కార్మికులందరూ విధులకు గైర్హాజరయ్యారు నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు .
52000 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ తో సమ్మె కొనసాగుతోంది . ఇట్టి కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దాడి మహేష్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్ యాదవ్,క్లబ్ సెక్రటరీ పోతుల ప్రసాద్ ,బాడీ మెంబర్లు ,పర్మనెంట్ కార్మిక సోదరులు, కన్నాల రాణపూర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.