- Advertisement -
సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి.
The survey details should be entered very carefully.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
వరంగల్
సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని అనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి ఆన్ లైన్ లో నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీవోలు, ఎంపీఓ, ఎంపీఎస్వోలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు శనివారం నుండి 30వ తేదీ వరకు వివరాల నమోదును పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈడీఎం శ్రీధర్, ఎంపిడివోలు, ఎంపీఓలు, ఎంపీ ఎస్ ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -