- Advertisement -
హోంవర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్
The teacher hit the student for not doing homework
ఉప్పల్
రామంతపూర్, గణేష్ నగర్ లోని కాకతీయ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల విద్యార్థి పై మ్యాథ్స్ సబ్జెక్టు టీచర్ ఘన్ శ్యామ్ దాడి కి దిగాడు. క్లాస్ కు జియోమెట్రీ బాక్స్ తీసుకు రాలేదని, హోంవర్క్ చేయలేదనే కారణంతో చితకబాదాడు. దాంతో విద్యార్దికి భుజం పైన తీవ్ర గాయాలు అయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
- Advertisement -