Sunday, January 25, 2026

 కలర్ ఫుల్ పోస్టర్ తో రెబల్ స్టార్ ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పిన “రాజా సాబ్” సినిమా టీమ్,

- Advertisement -

 కలర్ ఫుల్ పోస్టర్ తో రెబల్ స్టార్ ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పిన “రాజా సాబ్” సినిమా టీమ్, జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.

The team of the movie “Raja Saab” wished Rebel Star Prabhas a happy birthday with a colorful poster.

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్ వచ్చేసింది. కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ తెలియజేశారు మేకర్స్. మేళతాళాలతో ప్రభాస్ ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్న స్టిల్ తో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రత్యేకమైన స్వాగ్, స్టైల్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. త్వరలో “రాజా సాబ్” ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు.
సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన “రాజా సాబ్” ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రాజా సాబ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.
నటీనటులు – ప్రభాస్,  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్