Sunday, September 8, 2024

దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్

- Advertisement -

అభినవ చాణక్య సీఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం

హైదరాబాద్ : భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ  కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని… అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు.

The Telangana model is the compass for the country
The Telangana model is the compass for the country

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష

కేసీఆర్ తో సఫలం అయ్యిందన్నారు . ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు.
పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు.
యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 104కేంద్రాలకు పెంచారన్నారు. రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని అన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పలు తీసుకొచ్చామని, 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సిఎం. కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమన్నారు.

The Telangana model is the compass for the country
The Telangana model is the compass for the country
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్