Wednesday, March 26, 2025

కడియానికి కలిసి రాని కాలం

- Advertisement -

గులాబీ కాదని చెయ్యి అందుకుంటే…
కడియానికి కలిసి రాని కాలం
వరంగల్, మార్చి 25, (వాయిస్ టుడే

The time when Kadiya did not come together

రామేశ్వరం వెళ్ళినా.. శనీశ్వరం తప్పడం లేదనన్నటు తయారైందంట ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి. గులాబి పార్టీలో వర్గ పోరు తట్టుకోలేక హస్తం పార్టీలోకి మారితే.. ఇప్పుడు ఇక్కడా అదే వర్గపోరుతో తలపట్టుకోవాల్సి వస్తుందంట. ఉపముఖ్యమంతి సహా పలు పదవులు అనుభవించిన ఆ నాయకుడు ఇంటిపోరు తట్టకోలేక సతమతమవుతున్నారంట. ఇప్పుడు తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి ప్రత్యర్ధులు సిద్దమవుతుండటంతో టెన్షన్ పడిపోతున్నారంట.ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు నేతలు అక్కడివారే. తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ నిన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్నవారే. రాజయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి తీసేసి కడియం శ్రీహరికి కట్టబెట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న పోరు తారాస్థాయికి చేరుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, గులాబీ పార్టీ అధిష్టానం తీరుతో విసుగెత్తిన కడియం శ్రీహరి గెలిచాక హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి తన కూతురు కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ తెచ్చుకొని ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కడియం శ్రీహరికి అసలు పంచాయతీ మళ్ళీ మొదలైందంట. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 800 కోట్ల రూపాయల నిధులతో పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.సీఎం పర్యటన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా కేడర్‌తో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసిన కడియం.. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న సింగపురం ఇందిరను పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో చేరిన తర్వాత అందరినీ కలుపుకోవాల్సిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని.. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను నాయకులను పట్టించుకోలేదని చర్చ జరుగుతుంది.అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైన సింగపురం ఇందిరను కావాలనే కార్నర్ చేస్తున్నాడని ఇందిరా అనుచరులు చెబుతున్నారట. అందుకోసమే సీఎం సభ ఏర్పాట్ల విషయంలోనూ, సీఎంను నియోజకవర్గానికి ఆహ్వానించే విషయంలోనూ ఇందిరకు సమాచారం ఇవ్వలేదట. సాధారణ కార్యకర్తలారా ఇందిరను ట్రీట్ చేశారని అందుకే సీఎం సభకు సైతం ఇందిర డుమ్మా కొట్టారని ఆమె సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారుఆ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు పూర్తిగా తొలగిపోలేదనే టాక్ నడుస్తోంది. చాలా రోజులుగా ఇందిర వర్గం కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం శ్రీహరి వర్గంతో కలవలేక పోతుందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇందిర తన కేడర్ ని కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. మారిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక అప్పటినుంచి వీరి మధ్య వర్గ విభేదాలు మరింత పెరిగిపోయాయంటున్నారు.కడియం శ్రీహరి చేరిక సందర్భంగా ఇందిరకి కాంగ్రెస్ పెద్దల నుంచి పలు హామీలు లభించినట్లు చెప్తున్నారు. ఇందిర వర్గీయులకి నామినేటెడ్ పదవులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారంట. అయితే ఆ హామీలేవి ఇంతకాలం అమలు కాకపోతుండటంతో ఇందిర వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు స్టేషన్ ఘన్పూర్ లో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలపై ఇందిరకు కనీసం సమాచారం కూడా లేకపోవడంతో ఆమె కూడా అసంతృప్తితో కనిపిస్తున్నారు.కడియం కాంగ్రెస్‌లో చేరే సమయంలో పార్టీలో ఇందిరకి సమూచిత స్థానం కల్పించడానికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చి.. పార్లమెంట్ ఎన్నికల్లో పని చేయించుకుందంట. ఇప్పటివరకు ఆమెకి ఎలాంటి పదవి రాకపోగా స్టేషన్ ఘన్పూర్ లో తన వర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందననే ఆవేదనలో ఆమె ఉన్నారట. సీఎం సభ సందర్భంగా కూడా కడియం శ్రీహరి ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆవిడ ఆ సభకి దూరంగా ఉన్నారని ఇందిర వర్గం బహిరంగంగానే చెబుతుంది. మొక్కుబడి సమాచారం మాత్రమే ఇచ్చి ఇందిరని కనీసం సభకు రాకుండా కడియం శ్రీహరి ఎత్తులు వేశారని ఇందిర వర్గం ఆగ్రహంతో ఉన్నారట.సభకి ఒకరోజు ముందు ఇందిర తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపి కడియం శ్రీహరి పిలవకపోయినా స్టేషన్ ఘన్పూర్‌లో సీఎం పాల్గొనే సభకి హాజరైతే ఎలా ఉంటుందని సమాలోచనలు జరిపారంట. అయితే కడియం శ్రీహరి వ్యవహార శైలి అధిష్టానానికి తెలిసేందుకైనా ఈ సభకు వెళ్లకూడదని డుమ్మా కొట్టారని ఇందిర వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కడియం శ్రీహరి తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న సింగపురం ఇందిర, ఏఐసీసీ పెద్దల వద్ద తన గోడు వెల్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారట. గత ఎన్నికల్లోను ఏఐసీసీ పెద్దల అండతోనే సింగపురం ఇందిరా టికెట్ తెచ్చుకున్నారని.. ఆ స్థాయిలో ప్రభావం చూపగల సత్తా ఇందిరకు ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో ఇన్ని రోజులు కడియం శ్రీహరి తీరును లైట్ గా తీసుకున్న ఇందిరా అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే, తనను పక్కన పెడుతున్నారన్న ఆవేదనతో.. ఏఐసిసి పెద్దల వద్దే తన విషయం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని ఇందిర అనుచరులు చెప్పుకుంటున్నారు. దాంతో ఇందిర ఏం చేయబోతుందోనని, కడియం వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. కడియం శ్రీహరి సైతం ఏం జరుగుతుందో అని అయోమయంలో పడ్డారట.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్