Sunday, September 8, 2024

తెగ తాగేశారు

- Advertisement -

తెగ తాగేశారు

హైదరాబాద్,

తెలంగాణలో మందుబాబులు గత ఏడాది తెగతాగేశారు. డిసెంబర్ నెలలో అయితే రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గిఫ్ట్ ఇచ్చారు. తమ జేబులు గుల్లచేసుకుని ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్‌లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్‌ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. 2023 డిసెంబర్‌ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి. తెలంగాణలో ఒక్కరోజే 313కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైంది. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
1060  కేసులు
కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌లు చేశారు. సిటీ పరిధిలోని పబ్‌లు, బార్లు, రిసార్ట్స్ వద్ద పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లై ఓవర్లు మినహా3 కమిషనరేట్లలోని అన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను మూసివేశారు. 59 ట్రాఫిక్ పీఎస్‌లలో మొత్తం 260 చెక్ పాయింట్ల వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. టీ న్యాబ్ పోలీసులు డ్రగ్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. నక్లెస్ రోడ్స్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌వైపు రహదారులను మూసివేసినప్పటికీ సెక్రటేరియట్ వద్దకు యువకులు భారీగా చేరారు. దీంతో పోలీసులు సైతం క్రౌడ్‌ను కట్టడి చేయలేక చేతులు ఎత్తివేశారు.మరోవైపు డ్రగ్ టెస్టుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పబ్స్, బార్లు, రెస్టారెంట్‌లలో పోలీసులు మఫ్టీలో వెళ్లి తనిఖీలు చేపట్టారు. స్నిప్పర్ డాగ్స్ ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. నిబందనలు ఎంతవరకు పాటిస్తున్నారనే దానిపై పరిశీలించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి కోసం సెర్చ్ చేశారు. చెక్ పాయింట్స్ వద్ద 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ టెస్టులు చేశారు. దీంతో రాత్రి 11.30 గంటల వ్యవధిలోనే అంటే కేవలం రెండున్నర గంటల్లోనే మొత్తం 1060 కేసులు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ సప్లయర్లు పట్టుబడ్డారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు, డ్రగ్ టెస్టుల కేసుల వివరాలను ఈ రోజు మీడియా సమక్షంలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఏపీలో మరో ఘటన.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్‌ (20), శ్రీనివాస్‌ (21), రాహుల్‌ (21) ముగ్గురూ ద్విచక్ర వాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వైపుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్