ముఖ్యమంత్రితో ఐబీఎం  వైస్ ప్రెసిడెంట్ భేటీ

- Advertisement -

ముఖ్యమంత్రితో ఐబీఎం  వైస్ ప్రెసిడెంట్ భేటీ

The Vice President of IBM met the Chief Minister

హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం  వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డానియెలా కాంబ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గారు ఆసక్తి కనబరిచారు.  ఈ సమావేశంలో మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు , ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular