Tuesday, April 1, 2025

రుణమాఫీపై ఇంటింటి సర్వే…

- Advertisement -

రుణమాఫీపై ఇంటింటి సర్వే…

The whole town is Satyaharishchandra

నల్గోండ, ఆగస్టు 20,
తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. వివిధ సాంకేతిక కారణాల వల్ల మూడు విడతల్లో పంట రుణం మాఫీ కాని రైతుల సంఖ్య అధికంగానే ఉంది. పంట రుణం మాఫీ కాలేదన్న ఆగ్రహంతో ఉన్న రైతులను సముదాయించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ అధికారిక సమాచారం మేరకు.. తమకు పంటరుణం మాఫీ కాలేదని ఫిర్యాదు చేసి ప్రతీ రైతు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించున్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఇంటింటి సర్వే జరపనుంది.గతేడాది శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో రూ.2 లక్షల రుణ మాఫీని ప్రకటించింది. గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ అధికారం చేపట్టాక, రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి 2023 డిసెంబరు 9వ తేదీల మధ్య పంట రుణం తీసుకున్న రైతులు రుణమాఫీ స్కీమ్ కు అర్హులుగా నిబంధనలు పెట్టింది. రుణమాఫీని కూడా మూడు కేటగిరీలుగా విభజించింది. రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ.2లక్షల చొప్పున మూడు విడతలగా రుణాలను మాఫీ చేసింది. అయితే, రైతుల రుణ మాఫీ పూర్తిగా జరగలేదు. వేలాది మంది రైతులు ఈ స్కీమ్ కు అర్హులు కాకుండా పోయారు. మూడు విడతల్లో రుణమాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రుణమాఫీ జాబితాల్లో పేర్లు లేని రైతులు అటు బ్యాంకులకు, మరో వైపు మండల వ్యవసాయ కార్యాలయాలకు పోటెత్తారు.చిన్న చిన్న కారణాలు, బ్యాంకు ఖాతాల్లో తప్పిదాలు, ఆధార్, పట్టా పాసుపుస్తకాల్లో పేర్లలోని వ్యత్యాసాలు ఇలా కనీసం 34 రకాలైన అంశాలను కారణంగా చూపి రైతుల పేర్లను తిరస్కరించారు. బ్యాంకర్లు, లేదంటే వ్యవసాయ, రెవిన్యూ శాఖల్లో జరిగిన తప్పులకు తమన బాధ్యలు చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోయారు. మూడు విడత రుణమాఫీ ముగిసిందని, హామీని పూర్తిచేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రుణమాఫీ జరగని రైతులంతా జిల్లాలా వారీగా రోడ్లెక్కడం మొదలు పెట్టారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అర్హులైన రైతులకు కచ్చితంగా రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది.రకరకాలైన కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులను తమ సమస్యలను వివరిస్తూ ఇప్పటికే జిల్లా అధికారులకు, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి అర్హులకు న్యాయం చేసేందుకు వ్యవసాయశాఖ మండల ఏఓలను నోడల్ అధికారులుగా నియమించింది. రుణ మాఫీ కానీ రైతులంతా తమ తమ మండల వ్యవసాయశాఖ అధికారులను కలిసి వివరాలు సమర్పించాలని కోరింది. ఇలా ఇప్పటికే ఒక్క నల్గొండ జిల్లాలోనే 13 వేల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలను సరిదిద్ది వారికి రుణమాఫీ వర్తించేలా చూసేందుకు వ్యవసాయ శాఖ ఇంటింటి సర్వే మొదలు పెట్టనుంది. ఈ వారంలోపే రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ ను తయారు చేస్తోందని, యాప్ అందుబాటులోకి రాగానే ఇంటింటి సర్వే మొదలవుతుందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్పాయి.
ఆందోళనలపై మంత్రుల సమాధానం
తు రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలు చేస్తున్న ఆందోళనలపై మంత్రులు స్పందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి. అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి అర్హులైన అందరికీ రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తం చేయలేకపోయం.. మిగిలిన రూ. 12 వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటు  రైతుల ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు రుణ మాఫీ కోసం పోరాటం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలపై నిషేధం విధించారు. రుణమాఫీపై రైతులు చేస్తున్న ఆందోళనలు, శవ యాత్రలపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు డీఎస్పీ జీవన్ రెడ్డి.రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై అయోమయానికి గురిచేస్తున్నారన్న బండి.. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్