Sunday, September 8, 2024

టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీల కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేయాలి

- Advertisement -

* స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలి
* హౌసింగ్ సొసైటీ లో జరిగిన అవకతవకలపై సిపిఐతే విచారణ జరిపించాలి
* తెలంగాణ అధికారుల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి డిమాండ్
హైదరాబాద్ డిసెంబర్ 8: తెలంగాణా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏ. రేవంత్ రెడ్డి,ఆయన  మంత్రివర్గ సవచర్లకు తెలంగాణ అధికారుల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి అభినందన తెలిపింది.శుక్రవారం సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో   జేఏసీ చైర్మన్ తిరువరంగం ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ జి రవీందర్ రెడ్డి లు మాట్లాడుతూ  మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆత్మగౌరం కొరకు పోరాడి తెలంగాణను సాధించుకున్నారో ఆ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లెల వ్యవహరించిన గత నిరర్థక ప్రభుత్వాన్ని గద్దె దించి మీపై కోటి కోటి ఆశలతో ఆశయాలతో నమ్మకంతో మీకు కట్టబెట్టిన విషయాన్ని మరవకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెగించి అగ్ర భాగాన నిలిచిన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ అధికార పెన్షనర్లు తదితర వర్గాల కుటుంబాలను గత దశాబ్దాలుగా అవమాన పాలు చేసి అన్యాయాలకు గురిచేసి నిర్లక్ష్యపరిచిన ఫలితమే 2023 ఎన్నికల్లో గత ప్రభుత్వానికి జరిగిన గుణపాఠం గా గ్రహించాలని పేర్కొన్నారు. ఉద్యోగ వర్గానికి పెన్షనర్లకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న డి ఏ, డిఆర్ లను వెంటనే విడుదల చేయాలని, వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే 317 జీవో ప్రకారం సొంత జిల్లాలకు ఉద్యోగులను పంపించాలని, మండల విద్యాధికారి ఉప విద్యాధికారిని నియమించాలని, ఉద్యోగులకు ఉచిత  వైద్యం అందించాలని ప్రబాకర్  విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఐదు పర్సెంట్  గత ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ ను  15 శాతంగా పెంచాలని, పిఆర్సి నివేదిక ను జనవరి వరకు తెప్పించుకొని 50%గా పెట్టింటి ప్రకటించాలని, ఉద్యోగ పెన్షన్ దారులకు  వెంటనే నగదు రైత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో జనవరి నుండి అమలు అయ్యేటట్లు చర్యలు చేపట్టాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో  ఉన్న న్యాయపూరిత సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం పాలసీ మ్యాటర్లు చర్చించి సందర్భంలో కేవలం గుర్తింపు సంఘాలే కాకుండా తెలంగాణలోని అన్ని రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలను ఆహ్వానించి చర్చించారని కోరారు. దీర్గకాలికంగా ఈ కుబేర్ లో పెండింగ్ లో బిల్లులన్నిటిని వెంటనే మంజూరు చేయాలని గత  ప్రభుత్వంతో అంట కాకి ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల ప్రతినిధులుగా చెప్పుకొని వేలకోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన గచ్చిబౌలి లోని ఉద్యోగుల ఇండ్ల ప్లాట్ల కేటాయింపుల్లోని అక్రమాలపై గత  కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన విచారణలో నిఖితల అంశాలపై తమరు చొరవ తీసుకొని మొత్తం గచ్చిబౌలి సచివాలయ ఉద్యోగుల ఐదు సొసైటీలను రద్దు చేసి సీనియర్ స్పెషల్ ఆఫీసర్ అధికారిని నిర్మించాలని సిపిఐ విచారణ కొరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వారు కోరారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు .ఈ సమావేశం లో జేఏసి నేతలు బి.రాంశెట్టి,కే.సంజీవ రెడ్డి,రవ్వ జగదీశ్,గుండం మోహన్ రెడ్డి,వి.సురేష్,కే.ప్రబాకర్,టి.కేశవా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్