- Advertisement -
మద్యం దుకాణంలో చోరీ
Theft at a liquor store
తాడేపల్లి
మద్యం దుకాణంలో చోరీ జరిగిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజ జాతీయ రహదారి వెంబడి సర్వీస్‌రోడ్డు పక్కనే వున్న బుడ్డి వైన్స్‌లో అర్ధరాత్రి మద్యం దుకాణం పైకప్పు కట్ చేసి దొంగ లోపలకు చొరబడ్డాడు. దొంగ ఒంటిపై దుస్తులు ఏమీ లేకుండా లోపల డ్రాయర్‌తో ముఖం కనబడకుండా ఒక కవర్ కప్పుకొని లోపలికి వెళ్లాడు. డెస్క్‌లో వున్న సుమారు 2.50లక్షలు అపహరించుకుపోయాడు. పొద్దున్నే దుకాణ యజమాని, సిబ్బంది దుకాణం తెరచి చూడగా డెస్క్ పగలకొట్టి ఉండడం గమనించారు.వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్‌ఐ వెంకట్ మద్యం దుకాణాన్ని, లోపలి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -