Sunday, September 8, 2024

గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ

- Advertisement -

ఆలయాల్లో ఆగని చోరీలు

అదిలాబాద్. ఆగస్టు 30:  ఆలయాలను టర్గెట్ చేస్తున్నారు. రెక్కీ నిర్వహించి మరీ దోచుకుంటున్నారు. భద్రత ఉన్నా.. కన్నుకప్పి మరీ దోచుకుంటున్నారు. దేవుడు అన్న భయం, భక్తి  లేకుండా అరాచకం సృష్టిస్తున్నారు. తెలంగాణ అన్నవరంగా పిలుచుకునే గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంను దోచుకున్నారు. మంచిర్యాల జిల్లా లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీకి పాల్పడింది దొంగల ముఠా. ఆలయంలో ప్రదాన కెమెరాలను ద్వంసం చేసి.. మరికొన్ని కెమెరాల దిశను మార్చి చోరీకి పాల్పడింది ముఠా.ఇద్దరు‌ వ్యక్తులు ఆలయంలోకి‌ చొరబడి సత్యనారాయణ స్వామి ప్రదాన ఆలయం గేట్ల తాళాలు పగలగొట్టి లోపలకి చొరబడింది ముఠా. ఆలయాలోని మూడు ప్రదాన హుండిలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా రెండు హుండీల తాళాలు పగలక పోవడంతో మరో హుండీని పగల గొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు దుండగులు.

Theft at Gudem Satyanarayana Swamy Temple
Theft at Gudem Satyanarayana Swamy Temple

గూడెం ఆలయంలో చోరీకి పాల్పడ్డ కొద్ది సేపటికే సరిహద్దున ఉన్న జగిత్యాల‌ జిల్లాలోని మరో మూడు ప్రదాన ఆలయాల్లో చోరీకి తెగించింది ముఠా. జగిత్యాల జిల్లాలోని దర్మపురి , రాయపట్నం, తిమ్మపూర్ లోని మరో మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడ్డట్టుగా గుర్తించిన లక్షేట్టిపేట పోలీసులు.. దొంగల ముఠా ను పట్టుకునేందుకు మూడు టీంలను రంగంలోకి దింపింది. గూడెం సత్యనారాయణ ఆలయంతో పాటు హనుమాన్ పంచముఖి ఆలయంలోను చోరీకి యత్నించినట్టు గుర్తించిన పోలీసులు.. స్వామి వారి విలువన ఆభరణాలు భద్రంగా ఉన్నట్టు గుర్తించారు. గూడెం ఆలయ ఈవో చెప్పిన వివరాల ప్రకారం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో భక్తులు సమర్పించిన అమ్మవారి బంగారు మంగళ సూత్రం , హుండిలోని 8 వేల నగదు చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు.ఈ‌ ఘటనకు 24 గంటల ముందు మంచిర్యాలలో జిల్లా కేంద్రంలోని ఆరు దుకాణాల్లో వరుస చోరీలు జరుగగా.. అదే ముఠా ఆలయాలను టార్గెట్ చేసిందా.. లేక ఈ ముఠా సభ్యులు వేరా అన్నది తేలాల్సి ఉంది. మరో వైపు చోరీ ఘటనతో రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆదారాలు సేకరణ కొనసాగుతుండటంతో ఆలయంలో ప్రదాన పూజలు నిలిచిపోయాయి.పోలీసుల దర్యాప్తు అనంతరం స్వామి వారికి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాస్. శ్రావణ మాసం కావడంతో ఉదయం నుండి స్వామి వారి వ్రతాలకు వచ్చిన భక్తులతో ప్రదాన మండపాల్లో నిండిపోగా.. స్వామి వారి దర్శనానికి.. వ్రతాలు, పూజలకు మరో మూడు గంటల సమయం పట్టనుంది.

Theft at Gudem Satyanarayana Swamy Temple
Theft at Gudem Satyanarayana Swamy Temple
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్