Sunday, September 8, 2024

ఫ్యాక్టరీ మూసేసి వరకు తమ పోరాటం ఆగదు

- Advertisement -

ఫ్యాక్టరీ మూసేసి వరకు తమ పోరాటం ఆగదు

ఇథనాల్. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిరసన

వాయిస్ టుడే ప్రతినిధి

నిర్మల్ జిల్లాలోని దిలార్పూర్ మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో ఇథినల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. దీంతో తమకు లాభం చేకూరుతుంది అనే కంటే నష్టం ఎక్కువగా జరుగుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు… శుక్రవారం గ్రామ ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో దిలాల్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించనున్న ఇథినల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని పలు అంశాలపై చర్చించుకున్నారు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఏకమై ఆ ఫ్యాక్టరీని నిలిపివేసే దాకా పోరాడాలని తీర్మానించారు దీనికి ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ మూత పడేంత వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిలవర్పూర్ మండల కేంద్రంలోని రహదారిపై రైతులంతా నిరసనలు చేపట్టారు దీంతో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసన విరమించాలని గ్రామ ప్రజలను కోరారు కానీ కలెక్టర్ వచ్చేంతవరకు తమ నిరసన ఆపబోమని చెప్పడంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య సల్ప ఉద్రిక్తత.చోటుచేసుకుంది. అనంతరం గ్రామస్తులకు నచ్చచెప్పడంతో విరమించారు…

ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలు.

ఫ్యాక్టరీ చుట్టుపక్కల పంటల దిగుబడి తగ్గుతుంది.

ఫ్యాక్టరీ వ్యర్ధాలు గంగజలంలో కలవడం మూలంగా గంగానది కలుషితం అవడంతో పాటు పశువులు ఆ నీరును తాగడం వల్ల వ్యాధి సంక్రమించి చనిపోయే అవకాశం ఉంది.

ఫ్యాక్టరీ మూలంగా వాతావరణ కాలుష్యం ఏర్పడే అవకాశం.

వరి పత్తి మీరుప పంటలు ఎదగకుండా పూతలోని ఆగిపోయే అవకాశం.

ఫ్యాక్టరీ వ్యర్ధాలు గంగాజలంలో కలవడం మూలంగా చేపలు చనిపోయే అవకాశం తో పాటు మత్స్యకారులకు సంపద ను కోలిపోయే అవకాశం.

భూసారం తగ్గుతుంది

ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకుని ఫ్యాక్టరీని మూసేసే విధంగా చర్యలు తీసుకోవాలని గుండంపల్లి దిల్వార్పూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేనియెడల తమ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్