
ఖమ్మం: ఎన్నికల సంఘం కు ఖమ్మం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల నాగేశ్వరరావు పిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. తుమ్మల మాట్లాడుతూ బీ.అర్.ఎస్ అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ అధికారిక ఫార్మాట్ లో లేదు. ఫార్మెట్ మార్చడం పై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేశా. రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసానని అయన అన్నారు. రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘం కు, న్యాయస్థానం లో పిర్యాదు చేస్తాం. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్ లో కాకుండా బీ.అర్.ఎస్ అభ్యర్థి పువ్వాడ మార్చి ఇచ్చారు. ఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చారు. డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారు. నాలుగు సెట్స్ నామినేషన్లు తప్పులు ఉన్నాయి. ఫార్మాట్ t లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగా. ఆర్.వో పై న్యాయ పోరాటం చేస్తా. ఆర్.వో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అయన ఆరో్పించారు. .


