Saturday, March 7, 2026

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎలాంటి అపోహలు వద్దు

- Advertisement -

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఎలాంటి అపోహలు వద్దు

There are no misconceptions about comprehensive house-to-house family survey

సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి

సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి:  మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 06 రాష్ట్ర. ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నవంబర్ 6 నుండి  30 వరకు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే  దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఈ  సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మరియు హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు  కుల సర్వే ను బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని తెలిపారు. సర్వే నిర్వహణకు 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ జీవో విడుదల చేశామని, ప్రభుత్వం సర్వే కి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 30 వ తేదీ వరకు సర్వే  జరుగుతుందని, ముందుగా ఎన్యుమరేటర్ బ్లాక్  గా గుర్తించిన మ్యాప్ ప్రకారంగా ఇళ్లను సర్వే చేసి స్టికర్ వేసి ఇంటి యజమానులకు సమగ్ర కుటుంబ సర్వే పై సమాచారం ఇచ్చి, 9వ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సమగ్ర వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. సర్వే పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఒక కోటి 17 లక్షల 44 వేల ఇండ్లు సర్వే చేయడానికి 88 వేల  ఎన్యూమరేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్ కు 150 ఇండ్లు కేటాయించారని, కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ సర్వే అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారంతో  భవిష్యత్ లో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సర్వే తో ఎవరికీ అన్యాయం జరగదని, ఇబ్బందులు కలగవని, ఈ సర్వే  భవిష్యత్తులో అందరికీ న్యాయం జరిగే విధంగా దోహదపడుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి కాబోతుందన్నారు. సుహృద్భావ వాతావరణంలో సర్వే జరగాలని, అందుకు తెలంగాణ యావత్ సమాజం, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు,  ప్రతి పక్ష నాయకులు సహృదయంతో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

ప్రజలను భ్రమ పెట్టి, భయపెట్టే విధంగా ప్రవర్తించకూడదని, అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేసారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ  కార్యక్రమానికి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారు  సహకరించాలని కోరారు. సమాచార సేకరణ అధికారికి పూర్తిగా సహకరించి సమగ్ర సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ లోని 29,58,277 ఇండ్ల సర్వేకు 20,920 మంది ఎన్యూమరేటర్లను, 1728 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు తెలిపారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ జంటనగరాల ప్రజలందరూ పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నేటి నుంచి 30 వ తేది వరకు  సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని, ప్రజలందరూ సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన ఇంటింటికి వెళ్లి ఓపికగా సమాచారాన్ని సేకరించాలని సూచించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్.జి.ఓ లు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సర్వేకు సహకారం అందించాలని కోరారు.

అనంతరం ఎన్యుమరేటర్లకు సర్వేకు సంబంధించిన (పెన్ను, ప్యాడ్, పెన్సిల్, షార్పునర్, సీడీ రైటర్ తో పాటుగా ఎన్యుమరేటర్ మార్గదర్శి బుక్ లెట్)  సామాగ్రి కిట్ లను మంత్రి, మేయర్, డిప్యూటీ మేయర్, కలెక్టర్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కమీషనర్లు ఎన్యుమరేటర్లకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీష్, అలివేలు మంగతాయారు, చంద్రకాంత్ రెడ్డి, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి,జోనల్  ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రజినీ కాంత్, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్