- Advertisement -
జేపీసీలో ముగ్గురు ఏపీవాళ్లు
There are three AP people in JPC
న్యూఢిల్లీ, డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఫీవర్ నడుస్తోంది. ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నదే జమిలి లక్ష్యం. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది దీనికి. పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది జమిలి బిల్లు. అయితే ఈ బిల్లును ఆమోదించాలని భావిస్తున్న కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది లోక్సభ ఎంపీలు, పదిమంది రాజ్యసభ ఎంపీలతో సహా మొత్తం 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఈ కమిటీ పరిశీలించనుంది. అయితే ఈ 31 మంది ఎంపీల్లో .. ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉండడం విశేషం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవల్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.ఈ కమిటీకి పిపి చౌదరి చైర్మన్గా వ్యవహరించునున్నారు. కమిటీలో ఏపీకి చెందిన బిజెపి ఎంపి సీఎం రమేష్, టిడిపికి చెందిన హరీష్ బాలయోగి, జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరీలకు అవకాశం కల్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ వాత్ర పేరును ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కు సైతం అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే కు సైతం చోటు దక్కింది.పిపి చౌదరి (చైర్మన్), డాక్టర్ సీఎం రమేష్, బన్సూరి స్వరాజ్, పురుషోత్తం భాయ్ రూపాల, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణు దయాల్ రామ్, బి.మహతాబ్, డాక్టర్ సంబిత్ పాత్ర, అనిల్ బాలుని, విష్ణు దత్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్ర, మనీష్ తివారి, శుక్ దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, జిఎం హరీష్ బాలయోగి, సుప్రియ సూలే, డాక్టర్ శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, చందన్ చౌహన్, వల్లభనేని బాలశౌరి సభ్యులుగా ప్రకటించారు. తదుపరి పార్లమెంటు సమావేశాల చివరి వారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తమ రిపోర్టును సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- Advertisement -