20 C
New York
Tuesday, May 28, 2024

వైకాపా పాలనలో అభివృద్ధి అనేది లేదు

- Advertisement -

వైకాపా పాలనలో అభివృద్ధి అనేది లేదు

పేదలకు వైకాపా చేసిందంటూ ఏమీ లేదు

 

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డ

 

బద్వేలు ఆర్టిసి బస్టాండు వద్ద కూటమి పార్టీల భారీ బహిరంగ సభ

 

 

 

బద్వేలు

వైకాపా పాలనలో అభివృద్ధి అనేది ఏ మాత్రం లేదు పేదలకు వైకాపా చేసిందంటూ ఏమీ లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూటమి పార్టీల బహిరంగ సభలో విష్ణువర్ధన్ రెడ్డి వైకాపా పాలనపై మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా పేదల భూములు లాక్కోవడం తప్పితే ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన గుడి బద్వేల్ లోని అయ్యప్ప ఆలయాల సమస్యను పరిష్కరించడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేలా బిజెపి జిల్లా అధ్యక్షుడు శశి భూషణ్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు కేంద్రము రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీలు వస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వైకాపా పాలనలో జిల్లాలు రాష్ట్రము పూర్తిగా నష్టపోయిందని తెలిపారు. ఈనెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ బిజెపి అభ్యర్థి బొజ్జ రోశయ్య కడప పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు బొజ్జ రోశయ్య మాట్లాడుతూ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అరాచకాలు పెరిగిపోయాయని వీరిని సాగరం పాలని కోరారు. కడప పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బిజెపి జిల్లా అధ్యక్షుడు శశి పూజ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ సుబ్బరాయుడు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విజయ్ జనసేన నాయకులు రమేష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు, అలాగే తెలుగుదేశం నాయకులు వెంగళరెడ్డి రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు హాజరయ్యారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!