16.1 C
New York
Wednesday, May 29, 2024

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు లేరు

- Advertisement -

 మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు లేరని స్పష్టం చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్‌ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు.

అందరం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. .తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు.

దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్‌ఎస్‌ అని దుయ్యబటారు.

ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్‌రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్‌ రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్‌ చేయాలని అన్నారు.

‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్‌ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?.లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస​ 14 లోక్‌సభ సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!