జర్నలిస్టుల ముసుగులో అబద్ధాలు చెపుతామంటే ఊరుకునేది లేదు
బీఆర్ఎస్ అక్రమ డబ్బుతో యూ ట్యూబ్ ఛానెల్స్ ను పెంచి పోషిస్తోంది
జర్నలిస్ట్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కి మెట్టు సాయి కుమార్ హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 10
There is no peace in telling lies under the guise of journalists.
జర్నలిస్టుల ముసుగులో అబద్ధాలు చెపుతామంటే ఊరుకునేది లేదని జర్నలిస్ట్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ అక్రమ డబ్బుతో యూ ట్యూబ్ ఛానెల్స్ ను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. గురువారం గాంధీ భావన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని విమర్శించినా, తిట్టినా పర్లేదు జర్నలిస్టుల పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తామంటే ఊరుకోం అన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు బీఆర్ఎస్ తొత్తులు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్నారు పొద్దునే లేస్తే చాలు ముఖ్యమంత్రిని ఎలా తిట్టాలి అనే ఆలోచిస్తున్నారు 33 యూ ట్యూబ్ ఛానెల్స్ పెడితే బాగుండని కేటీఆర్ అన్నారు యూ ట్యూబ్ ఉచ్చులో పడి ఇబ్బంది పడేది కేటీఆర్ మాత్రమేకొందరు జర్నలిస్టుల వల్లనిజమైన జర్నలిస్టుల పరువు పోతోందన్నారు.కొందరు జర్నలిస్టులు బీఆర్ఎస్ తొత్తులుగా, పేటీఏం బ్యాచులుగా, పెయిడ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు జర్నలిస్టుల పేరుతోకొందరు చేస్తున్న అక్రమాలు మామూలుగా లేవుజర్నలిస్టుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను కొందరు ఇబ్బందులు పెడుతున్నారుతెలంగాణ ఉద్యమంలోజర్నలిస్టుల పాత్ర మరవలేంఅమ్మాయిలను ఇబ్బంది పెట్టి కేసులైన వాళ్లు కూడా ప్రభుత్వం జర్నలిస్టుల గొంతు నొక్కుతోంది అంటే ఏం చేయాలి జర్నలిజం వ్యవస్థను కొందరు చిల్లర వ్యక్తులు దిగజారుస్తున్నారు.జర్నలిస్టులు సమాజ మంచికోసం ప్రాణాలు అడ్డుపెట్టి తెగించేవాళ్ళుకొందరు జర్నలిస్టులు కావాలంటే బీఆర్ఎస్ పార్టీలో చేరండి జర్నలిస్టుల ముసుగులో అబద్ధాలు చెపుతామంటే ఊరుకునేదని హెచ్చరించారు.