- Advertisement -
గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మె చేసే ప్రసక్తే లేదు
There is no question of strike by Gram Panchayat staff
సాదుల శ్రీకాంత్
హైదరాబాద్
గ్రామపంచాయతీ సిబ్బంది జీవితాలతో ఆడుకునే ప్రతిపక్ష పార్టీలు సమస్యలను అదునుగా చేసుకొని ప్రభుత్వం మీదికి సమ్మె రూపంలో ఉసిగొల్పుతోందని గ్రామ పంచాయతీ కారోబార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల
శ్రీకాంత్ ఆరోపించారు. అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, క్యాబినెట్ మంత్రులందరినీ కలిసి సమస్యలు వివరించామని, ప్రజాప్రభుత్వం త్వరలోనే వాటిని పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని.. ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం మనల్ని పావులుగా చేసుకుంటోందన్నారు.
- Advertisement -