- Advertisement -
ఆ షిప్ లో బాయిల్డ్ రైసు మాత్రమే వుంది
There is only boiled rice in that shipకాకినాడ
కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ షన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 27 నేను ఒక్కడినే షిప్ లోకి వెళ్లి పరిశీలించి వచ్చాను. షిప్ లో పిడీస్ రైస్ ఉన్నది వాస్తవమె. ఆ పీడీఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు అనే విషయాలు క్షుణంగా పరిశీలిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో షిప్ లోకి ఒక బృందం వెళ్లి క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఏ మిల్లు నుండి ఎవరు సప్లై చేశారు, షిప్ వరకు రావడానికి ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారో నిర్దారణ చేసుకుంటాం. కస్టమ్స్ డిపార్ట్, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీ, సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. పోర్ట్ కి వెళ్ళే ప్రతి లోడు పరిశీలిస్తాం. సీజ్ చేసిన షిప్ ప్రస్తుతం మన పోర్ట్ లో కంట్రోల్ లోనే ఉంది. మొదటి అడుగు క్రింద షిప్ లో పీడీఎస్ స్టాక్ కనుకున్నం,చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రత్యేకంగా నియమించిన బృందం లో అధికారులకు ఒక వర్క్ షిప్ నిర్వహించాం రేపటి నుండి షిప్ మీద కు బృందాన్ని ఫీల్డ్ పై పంపిస్తాం. అన్ని చెక్ పోస్ట్లు స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చి 24 గంటలు చెక్ పోస్ట్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. చెక్ పోస్ట్ లో ఉండేవారికి సరైన శిక్షణ ఇచ్చి ప్రతి లారి క్షుణంగా పరిశీలించేలా ఆదేశాలు ఇస్తాం. ఏదైనా సమాచారం తెలిస్తే 7993332244 ఈ నంబర్ కి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కాకినాడ పోర్ట్ పై ఉన్న చెడ్డ పెరు పోగెట్టే లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఒక షిప్ ని ఆపడానికి పోర్ట్ కి అధికారం ఉంది. కొన్ని విషయాల్లో హై కోర్టు నిబంధనలు అనుసరించి సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కెన్ స్టార్ షిప్ లి తనిఖీలు చేశాం. అందులో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ పోలీసు డిపార్ట్ మెంట్ కి ఎస్.ఓ.పి తయా చేసే పని లో క్యాబినెట్ ఉంది..త్వరలో వెల్లడిస్తారని అన్నారు.
- Advertisement -




