- Advertisement -
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య
There was a technical problem in the flight that PM Modi was supposed to travel
ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ
దేవగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం
సాంకేతిక సమస్యను ముందే గుర్తించిన అధికారులు
దేవ్ గఢ్
ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రధాని ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రచారం, ఇతర కార్యక్రమాలను ముగించుకొని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే ఎయిర్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాని ఇక్కడి దేవగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. ఝార్ఖండ్లో ఈ నెల 20న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు.
- Advertisement -