అవన్నీ చిన్న విషయాలే
ఈటల
సికింద్రాబాద్
మల్కాజ్ గిరి భాజపా టికెట్ విషయంలో భాజపా నాయకుల అలకలు టీ కప్పులో తుఫాన్ లాంటిదని మల్కాజ్ గిరి భాజపా ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు..ఈటెల రాజేందర్ ను మల్కాజ్ గిరి భాజపా అభ్యర్థిగా ప్రకటించడం తో కంటోన్మెంట్ భాజపా నాయకుడు శ్రీ గణేష్,సరిత లు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు .లాల్ బజార్ లోని మహంకాళి దేవాలయాన్ని మల్కాజ్గిరి భాజాప అభ్యర్థి ఈటెల రాజేందర్ సందర్శించారు.దేవాలయానికి సంబంధించిన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరగడం బాధాకరమని అన్నారు.మహంకాళి దేవాలయానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.స్థానికులు గత కొన్ని రోజులుగా దేవాలయ స్థల విషయంలో పోరాటం చేస్తున్నారని వారికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.సనాతన ధర్మాన్ని,దేవాలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు..
అవన్నీ చిన్న విషయాలే
- Advertisement -
- Advertisement -