ఆటలు ఆడినప్పుడే శరీరకంగా దృఢంగా ఉంటారు

- Advertisement -

విద్యార్థులు ప్రతి రంగంలో రాణించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి రాజు

They are physically strong only when they play games
They are physically strong only when they play games

కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 29 (వాయిస్ టుడే):  విద్యార్థులు ప్రతి రంగంలో రానిచ్చినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా  సోనియాశంకర్  హాకీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రంగంలో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆట ఆడినప్పుడు ఎవరో ఒకరు గెలవడం జరుగుతుందని,ఆటలు ఆడిన అందరు గెలవరని, ఓడిపోయిన వారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉండరని ఎవరైనా ఓడితేనే తిరిగి ఎలా గెలవాలని నేర్చుకుంటారని అన్నారు. తమ విద్యాశాఖ నుండి ఏ అవసరం ఉన్న తనను సంప్రదిస్తే తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సోనియాశంకర్ ఫౌండేషన్ వారికి ఆయన తెలిపారు. అనంతరం సోనియాశంకర్ ఫౌండేషన్ నిర్వాహకురాలు సోనియాశంకర్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా గాంధీ స్టేడియంలో హాకీ పోటీల నిర్వహించడం జరిగిందన్నారు. ఈ హాకీ పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని, విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఆటలు ఆడారన్నారు. ఈ ఆటల పోటీకి వచ్చిన విద్యార్థులను అభినందిస్తున్నా మన్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి శాలువా కప్పి మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి కరణ్ అర్జున్, నీల లింగం, ఆకి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular