Sunday, September 8, 2024

టోఫెల్ పేరుతో దోచేస్తున్నారు

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 11:  ప్రభుత్వ స్కూళ్లలో ఉపాద్యాయులను నియమించుకుండా టోఫెల్ పేరుతో ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టారని సీఎం జగన్‌పై జనసేన సంచలన ఆరోపణలు చేసంది.  విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం వేస్తున్నారన్నరాు.  3 నుంచి 10 విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్ష ను బలవంతంగా రుద్ేదందుకు  ఈటీఎస్ వెంటపడి మరి ఒప్పందం కుదుర్చుకున్నారని  ఆరోపించారు.  ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టి ఏకంగా  2027 వరకు పథకం ఎంఓయూ కుదుర్చుకున్నారని ఆరోపించారు.  ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం వెనుక  భారీ స్కాం ఉందన్నరు.  అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారని..  జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారని  నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు  తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోఫెల్ పై ప్రభుత్వ ఒప్పందాల వివరాలను బయట పెట్టారు.  గత మేలో ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు.  విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు  టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ టోఫెల్ అనే  పరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత ఈ పరీక్ష రాస్తారు. ఒక వేళ ఫెయిలయితే ట్రైనింగ్ తీసుకుంటారు. కేవలం విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకునే వారికి మాత్రమే..ఈ టోఫెల్ వల్ల ఉపయోగం ఉంటుంది.

They are robbing in the name of TOEFL
They are robbing in the name of TOEFL

అయితే, ఏపీలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ సర్కారు ఈటీఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గత మేలో  సీఎం జగన్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్, ఉన్నతాధికారులు, ఈటీఎస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యార్థులను టోఫెల్ దిశగా తీర్చిదిద్దడంపై ఈటీఎస్ తో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు.  3 నుంచి 5 తరగతుల వారికి టోఫెల్ ప్రైమరీ పరీక్ష… 6 నుంచి 9 తరగతుల వారికి టోఫెల్ జూనియర్ స్టాండర్డ్ పరీక్ష నిర్వహించేలా ఒప్పందం చేసుకుననారు. 10వ తరగతిలో విద్యార్థులు మాట్లాడే నైపుణ్యాలను అంచనా వేసేందుకు స్పీకింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈటీఎస్ తో ఒప్పందంలో భాగంగా టోఫెల్ యంగ్ స్టూడెంట్ సిరీస్, టోఫెల్ ప్రైమరీ ప్యాకేజి, టోఫెల్ స్టాండర్డ్ ప్యాకేజి, టోఫెల్ జూనియర్ స్పీకింగ్ పరీక్ష నిర్వహిస్తారు. టోఫెల్ కు సన్నద్ధం చేసే క్రమంలో 3 నుంచి 9వ తరగతుల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7.50 చొప్పున ప్రభుత్వం ఈటీఎస్ కు చెల్లిస్తుంది. 5 నుంచి 9వ తరగతుల్లో రీడింగ్, లిజనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తారు. 9వ తరగతిలో మాట్లాడడంలో ఉత్తీర్ణులైన వారికి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఇస్తారు. ఉత్తమ నైపుణ్యం కనబర్చిన 52 విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడ్రోజులు అమెరికాలో పర్యటించే అవకాశం కల్పిస్తారు. ఈ పర్యటనలో రవాణా చార్జీలు ప్రభుత్వం, అమెరికాలో వసతి ఖర్చులు ఈటీఎస్ భరిస్తాయని ఒప్పందంలో ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్