- Advertisement -
మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడి దోపిడి
They broke into the house wearing masks and looted
52తులాల బంగారం, 41 ల్యాండ్ డాకుమెంట్స్ , 8.5లక్షల నగదు అపహరణ
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన
మల్కాజిగిరి :
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో ఓ ఇంట్లోకి చొరబడి సుమారు 15కోట్లు విలువజేసే బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్ అపహరించారని బాధితుడు మల్లికార్జున్ విలేకర్ల సమావేశంలో తెలిపారు.
బాధితుడు మల్లికార్జున్ తెలిపిన వివరాలు ప్రకారం కొన్ని సంవత్సరాలుగా కృష్ణమూర్తి, సీతారామశాస్త్రి తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా సుమారు రెండు కోట్ల రూపాయలు బాధితుడు మల్లికార్జున్ కి ఇవ్వాల్సి ఉంది ఇది అడుగుతున్న కారణంగా గుర్తుతెలియని వ్యక్తులతో తనపైదాడి చేయించి , ఇంట్లోని సిసి కెమెరాలు పగలకొట్టి సుమారు 8.5 లక్షల నగదు , 41 ల్యాండ్ డాకుమెంట్స్ , 52తులాల బంగారం అపహరిచారని , డివిఆర్ ని కూడా దొంగలించారని బాధితుడు మల్లికార్జున్ తెలిపారు. జరిగిన సంఘటనపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేవలం నాలుగు లక్షల రూపాయలు విలువచేసే వస్తువులు పోయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసారని , దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసామని తెలిపారు. తక్షణమే విచారణ జరిపి తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
- Advertisement -