- Advertisement -
పోలీసుల అదుపులో దొంగ.. భారీగా ఆభరణాలు స్వాధీనం
Thief in police custody. Huge jewels seized
విశాఖపట్నం
ఇళ్లల్లో చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని విశాఖ గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నింది తుడి నుంచి 26 తులాల బంగారం, 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని క్రైం డీసీపీ లతా మాధురి తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ జగనన్నకా లనీకి చెందిన జగదీశ్ తన తండ్రి గాజువాక శ్రీనగర్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తరచూ ఇక్కడికి వచ్చి నేరాలకు అలవాటు పడ్డాడు.ఈ క్రమంలో సింహగిరికాలనీకి చెందిన కుసుమకుమారి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది.దీంతో నిఘా ఉంచిన క్రైం పోలీసులకు శ్రీనగర్లో నిందితుడు పట్టుబడగా అతడి నుంచి మొత్తం 26 తులాల బంగా రం, సుమారు 50 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నా రు.ఇతనిపై గతంలో కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడ లో ఆయా పీఎస్ల్లో 14 కేసులు ఉన్నాయని వివరించారు.
- Advertisement -