- Advertisement -
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద
Thiru Nakshatra Maryada to Sri Sri Sri Pedda Jeeyar Swami
తిరుమల,
శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి 75వ తిరు నక్షత్రం (జన్మదినం) సందర్భంగా మంగళవారం ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది.
పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్ద జీయర్ స్వామికి ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు.
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్ స్వామీజీకి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద జీయర్ స్వామీ టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సీవీస్వోలకు ఆశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -