
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అంబటి జ్యోజీ రెడ్డి
కరీంనగర్, నవంబర్ 14 (వాయిస్ టుడే): కరీంనగర్ అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ పురుమల్ల శ్రీనివాస్ ఇద్దరు భూ కబ్జాదారులు అయితే బండి సంజయ్ మద్దతుగా నిలుస్తున్నారంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అంబటి జ్యోజీ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు భూ కబ్జాలు చేశారంటూ విమర్శించారు. పురుమల్ల శ్రీనివాస్ పైన భూకబ్జాలు చీటింగ్, ఫోర్జరీ కేసులు ఉన్నాయని అలాంటి కాంగ్రెస్ ఎలా పోటీ చేసే అవకాశం కల్పించిందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కాదని భూ కబ్జాదారునికి టికెట్ ఇచ్చి పార్టీ పరువు పోయింది అని అన్నారు. గంగుల కమలాకర్ బండి సంజయ్ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారే తప్ప ఎవరు కూడా శ్వేతా పత్రాన్ని విడుదల చేయడం లేదు దమ్ముంటే బండి సంజయ్ కేంద్రం నుంచి తెచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే ఇప్పుడు ప్రశ్నిస్తున్నావా అంటూ బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో అవకతవకలు జరుగుతుంటే బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. బండి సంజయ్ పైన 58 కేసులు ఉంటే పురుమల్ల శ్రీనివాస్ పైన 27 కేసులు నమోదయాయమి నాపైన పైన గతంలో కుట్రపూరితంగా సోషల్ మీడియా కేసు నమోదు చేశారంటూ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే వారికి ఓటు వేయవద్దంటూ విన్నవించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధిని చేస్తానంటూ హామీ ఇచ్చారు. అభివృద్ధి చేయకపోయినా పార్టీ మారిన రాళ్లతో చెప్పులతో కొట్టాలంటూ ప్రజలను కోరారు.



