Sunday, September 8, 2024

మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మేడిగడ్డ వెళ్తున్న నేతలంతా దారిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన రైతులను అడగండి అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డను పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. ప్రాజెక్టులో సమస్యలున్నాయని గుర్తిస్తే, సరిదిద్దే ప్రయత్నం చేయండి, విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోండని సూచించారు..

“Harish Rao On Congress Medigadda Tour : కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తీసుకువెళ్తున్నారు. అయితే ఈ సందర్శనకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. అసెంబ్లీ సభ వాయిదా పడిన తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు.

“Harish Rao On MLAs Medigadda Visit Today : అయితే సభ వాయిదా పడిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపించారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మేడిగడ్డ పర్యటన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉంటే, ఒక్క రిజర్వాయర్ గురించి మాత్రమే ఎత్తి చూపుతున్నారని హరీశ్ రావు (Harish Raon Fires On CM Revanth) విమర్శించారు.

“మేడిగడ్డ వెళ్తున్న నేతలంతా వెళ్లేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లబ్ది పొందిన ప్రజలను అడగండి. కేవలం మేడిగడ్డ వద్ద జరిగిన ఘటనను పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వాడుకుంటున్నారు. మూడుచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తుమ్మిడి హెట్టి వద్ద ఎందుకు ప్రాజెక్ట్ నిర్మించలేకపోయారు. ఇప్పటికే ఐదుగురు మంత్రులు వెళ్లారు. విజిలెన్స్ టీమ్ కూడా వెళ్లింది. ప్రాజెక్ట్‌లో లోపాలున్నాయని నివేదిక వస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయండి. ప్రాజెక్ట్ పై విచారణ చేయండి. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతులను ఇబ్బందులు పెట్టొద్దు. వారికి నష్టం కలిగే పనులు చేయొద్దు. నల్గొండ సభతో ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలని మేం చూస్తుంటే, మాకు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన పెట్టింది.” – హరీశ్ రావు, మాజీ మంత్రి

“మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నల్గొండ బహిరంగ(BRS Nalgonda Meeting Today) సభను అడ్డుకునేందుకే కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ ప్లాన్ చేసిందని మండిపడ్డారు. కృష్ణా గోదావరీ జలాలపై బీఆర్ఎస్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. నదీ జలాల విషయం కేంద్ర పరిధిలోకి వెళ్తే, ప్రతి చిన్న దానికి కేంద్రాన్ని అడగాల్సిందేనని వెల్లడించారు. దీన్ని నివారించేందుకే కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు జల ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. కేసీఆర్‌కు భయపడి అసెంబ్లీలో ఆగమేఘాల మీద కాంగ్రెస్ తీర్మానం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధమేనన్న కడియం, ఇవాళ్టి నల్గొండ సభ విజయవంతం అవుతందని ఆశాభావం వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్