- Advertisement -
హైదరాబాద్ : అక్టోబర్ 25(వాయిస్ టుడే): రాష్ట్రంలోని అధిక జనాభా గల మున్నూరుకాపులకు జనాభా దామాషా ప్రకారం బిఆర్ఎస్ పార్టీ 10 టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డిని, రాజ్య సభ సభ్యులు కోవా లక్ష్మణ్ పటేల్ ను కలిసి బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలోని మున్నూరు కాపులకు టికెట్లను అభ్యర్తిత్వ ఆశావాహులకు అధికంగా కేటాయించినట్లయితే వారిని మేము గెలిపించు కుంటామని రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆల్లపాటి లక్ష్మీనారాయణ,ఆకుల బాలకృష్ణ, తేల్ల హరికృష్ణ, బి నర్సింగ్ రావు తదితరులు పాలొన్నారు.

- Advertisement -