Wednesday, January 21, 2026

కేబినెట్ విస్తరణకు ముహూర్తం

- Advertisement -

కేబినెట్ విస్తరణకు ముహూర్తం
హైదరాబాద్, మే 27 (వాయిస్ టుడే )

Time for cabinet expansion

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ‌్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోనే బస చేయడంతో మంత్రి వర్గ విస్తరణ కోసమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జితో చర్చించారు. ఆదివారం రాత్రి సమావేశంలో ఓ నిర్ణయానికి రాలేకపోవడంతో సోమవారం కూడా సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.తెలంగాణ మంత్రి వర్గంలోకి కొత్తగా ఎంతమందికి అవకాశం కల్పించాలనే విషయంలో పార్టీలో చర్చ కొనసాగుతోంది. మంత్రి వర్గ రేసులో మహబూబ్‌ నగర్‌ నుంచి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి. సుదర్శన్‌ రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆదిశ్రీనివాస్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్‌ వంటి వారు పోటీ పడుతున్నారు. వీరిలో నలుగురికి మాత్రమే చోటు దక్కే అవకాశం ఉంది.మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా కొత్తగా తెరపైకి వచ్చింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, వెలమలలో ప్రేమ్ సాగర్‌ రావు, ఎస్సీలలో గడ్డం వివేక్, ఎస్టీలలో బాలూనాయక్, శంకర్ నాయక్, ఓబీసీ నుంచి వాకాటి శ్రీహరి, విజయశాంతిల పేర్లు ఉణ్నాయి. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేషీల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఒక్కో వర్గం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయిఇక హైకమాండ్‌ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్, తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొలిక్కి రాగా.. పిసిసి కార్యవర్గ కూర్పు పై మాత్రం ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులను సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించిన అధిష్టానం సామాజికవర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఈ జాబితాను ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులు ఖర్గే, రాహల్, కేసి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.కేబినెట్‌ విస్తరణ కొలిక్కి వచ్చినా పిసిసి కార్యవర్గంపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ కూర్పలో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ పెద్దపీట వేనున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సుమారు 70 శాతం అవకాశం కల్పించనున్న కాంగ్రెస్ వర్గాలు చర్చ జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్