Sunday, September 8, 2024

పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు వెతుక్కోవలసిన తరుణం

- Advertisement -

విస్తరించిన జీ 20

ఆఫ్రికా దేశాలకు సభ్యత్వం కల్పించిన మోడీ

Time to find new solutions to old problems
Time to find new solutions to old problems

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. శనివారం భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదన చేశారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించినటువంటి కూర్చీలో కూర్చోబెట్టారు. అయితే ఈ సదస్సులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మొరాకోలో సంభవించిన భూకంప మృతులుక సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలని కోరారు. వారికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.అలాగే జీ20 అధ్యక్ష హోదాలో భారత్ మీకు స్వాగతం పలుకుతోందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశను సూచించేందుకు ఇదే కీలకమైన సమయమని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయని.. అందుకునే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరితంగా పెంచేసిందని అన్నారు. కరోనాను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై విజయం సాధించగలమని పేర్కొన్నారు. మనమందరం కలిసి ప్రపంచంలో నెలకొన్నటువంటి అపనమ్మకాన్ని పారదోలుదామని.. ఈ క్రమంలోనే సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మనకు మార్గదర్శకంగా ఉంటుందని వివరించారు.అలాగే ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు… ఆహారం, ఇంధనం నిర్వహణ, ఆరోగ్యం, ఎనర్జీ, నీటీ భద్రత వంటి వాటిలో నెలకొన్న సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. భారత్ జీ20 అధ్యక్షతన.. దేశం లోపల, బయట అందరిని కలుపుకోని పోయేందుకు ప్రతీకగా నిలిచినట్లు తెలిపారు. అయితే ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారినట్లు పేర్కొన్నారు. దేశంలోని 70కి పైగా నగరాల్లో 200లకు పైగా జీ20 సదస్సులు జరిగినట్లు వెల్లడించారు.  సబ్‌కా సాత్ అనే భావనతోనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రతిపాదన చేస్తోందని..  దీనికి అంగీకరిస్తారని నమ్ముతున్నానని అన్నారు. అలాగే మీ అందరి అనుమతితో జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు గ్రూపులో స్థానాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉండగా మోదీ కూర్చున్న స్థానంలో ఇండియాకు బదులుగా భారత్ అనే నేమ్‌ప్లేట్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచానికి కొత్త దిశ చూపించాలి: ప్రధాని

ప్రపంచానికి కొత్త దిశ చూపించడానికి ఈ 21 వ శతాబ్దం ఎంతో కీలకమైన సమయం. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు వెతుక్కోడానికి ఇదే మంచి తరుణం. అందుకే మానవాభివృద్ధి కేంద్రంగానే విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. కొవిడ్‌ లాంటి మహమ్మారిని జయించగలిగితే…యుద్ధాల వల్ల ప్రజలు కోల్పోతున్న నమ్మకాన్నీ తిరిగి నిలబెట్టగలం. “G20 సదస్సుకి భారత్‌ అధ్యక్షత వహించడం ఐక్యతకు చిహ్నం. సబ్‌కా సాథ్‌ అనే నినాదం కేవలం దేశానికే పరిమితం కాదు. ప్రపంచానికీ వర్తిస్తుంది. ఈ సదస్సుని లీడ్ చేస్తోంది భారత దేశ ప్రజలే. కోట్లాది మంది దేశ పౌరులు పరోక్షంగా ఈ సదస్సులో భాగస్వాములై ఉన్నారు. దేశంలోని 60 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్‌ ఓ విజ్ఞప్తి చేస్తోంది. ఆఫ్రికన్ యూనియన్‌కి G20 దేశాల్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను”ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్‌ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది.

మొరాకోకి సాయం అందించేందుకు సిద్ధం: ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Time to find new solutions to old problems
Time to find new solutions to old problems

ఒడిశా కోనార్క్ వీల్‌ వద్ద నిలబడి ప్రధాని నరేంద్ర మోదీ

20 సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు. విదేశీ అతిథులు వచ్చే చోట భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈవెంట్ యొక్క అందాన్ని జోడించడమే కాకుండా.. భారతదేశ గొప్ప సంస్కృతిని, చారిత్రక వారసత్వం గురించి ప్రపంచానికి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. భారత్.. ఇంతమంది దేశాధినేతలకు తన సంస్కృతిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు జీ20 సదస్సుకు వేదికైన భారత మండపంలో.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన కోణార్క్ చక్రాన్ని ప్రదర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ అతిథులకు వివరించారుఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించబడింది. ఈ చక్రం భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం యొక్క భ్రమణం కాలచక్రంతో పాటు పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య చక్రానికి శక్తివంతమైన చిహ్నంగా కూడా పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాలకు, సమాజంలో పురోగతి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అయితే ఈ చక్రం ఒడిశాలోని కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయంలో నిర్మించారు. భారత కరెన్సీ నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్ర ముద్రించబడి ఉండటాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ముద్రించి, ఆపై 10 రూపాయల నోటుపై ముద్రించేవారు. కోణార్క్ చక్రం 8 వెడల్పు చువ్వలు.. అలాగే 8 సన్నని చువ్వలు కలిగి ఉంటుంది. ఆలయంలో 24 (12 జతల) చక్రాలు ఉన్నాయి. ఇవి సూర్యుని రథ చక్రాలను సూచిస్తాయి. 8 కర్రలు రోజులోని 8 గంటల గురించి చెబుతాయి. దీన్ని ఉపయోగించి, సూర్యుని స్థానం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారని నమ్ముతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని మరియు 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని కూడా నమ్ముతారు.ఇదిలా జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. భారత్ మండపంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వారందరికి స్వాగతం పలికారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మరో విషయం ఏంటంటే కొత్తగా జీ20లో సభ్యత్వం సాధించిన ఆఫ్రికా యూనియన్ అధినేతనకు ప్రధాని స్వాగతం తెలిపారు. ఆయన్ని ఆలింగనం చేసుకోని కూరిచులో కూర్చోబెట్టారు. మరోవైపు ప్రధాని మోదీ కూర్చున్నటువంటి టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌పై భారత్ అని రాసి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చనుందని జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే భారత్‌ను ఇండియాగా గుర్తించేవారు. అయితే ఇప్పుడు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాకు బదులుగా భారత్ అని గుర్తిస్తూ రౌండ్ టేబుల్‌పై భారత్ అనే నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ భారత్ మిమ్మల్ని స్వాగతిస్తుందని అన్నారు.

కోణార్క్ చక్రపై ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఇదే..

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ20 సదస్సుపై ట్విట్టర్ వేదికగా మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ఒడిశా రాష్ట్రాం సంస్కృతి, వారసత్వానికి జీ20 సదస్సులో గర్వించదగిన స్థానం కలిగిందని చెప్పారు. కోణార్క్ చక్ర అనేది భావి, భవిష్యత్తు తరాలకు సంబంధించిన నాగరికత భవనాలను వివరించే ఓ నిర్మాణ అద్భుతమన్న ధర్మేంద్ర ప్రధాన్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతదేశ వారసత్వం, విజ్ఞాన సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించడం.. ఓ అందమైన దృశ్యంగా ఉందని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. G20 సదస్సుకి వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతుండటం ఆసక్తికరంగా మారింది. యూకే ప్రధాని రిషి సునాక్ భారత్ మండపానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు. భారత్ మండపానికి చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోని ప్రధాని ఆత్మీయంగా స్వాగతించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో భారత్ మండపానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. చైనా ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌ రాకపోయినా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్ G20 సదస్సుకి హాజరయ్యారు. భారత్ మండపం వద్ద ప్రధాని మోదీ ఆయనను స్వాగతించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్