తిరుమల నెయ్యి విషయంలో సిబిఐ విచారణ చేయాలి

- Advertisement -

తిరుమల నెయ్యి విషయంలో సిబిఐ విచారణ చేయాలి

Tirumala ghee issue should be investigated by CBI

వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ
తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా  టీడీపీ,వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి.   సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ  చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి విమర్శించారు.  కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి.   చంద్రబాబు ని డిమాండ్ చేస్తున్నాం.   మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే,  సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే, – నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే, – తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి.  లేదా సిబిఐ  తో విచారణ జరిపించండని అన్నారు.  మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి.   మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular