- Advertisement -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు…
Tirupati Deputy Mayor Election
సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్తత
– పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. కానీ రెండోరోజు అర్ధరాత్రి సైతం తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన క్రమంలో రెండో రోజు సోమవారం అర్థరాత్రి తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, ఆయన బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళం నెలకొంది. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరడంతో తమపై దాడి చేశారంటూ ఇరు వర్గాలు ఆరోపించాయి. పరస్పర దాడి ఘటనలో రెండు వాహనాలను ధ్వంసం అయ్యాయి.
- Advertisement -