తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక – 2024
Tirupati District Police Department Annual Report – 2024
తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వెలసిన దివ్య క్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తి తో పాటు తిరుచానూరు, నారాయణవనం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం లాంటి పుణ్య క్షేత్రాలు తిరుపతి జిల్లాలో వెలసి ఉన్నాయి. మన దేశానికే తలమాణీకమైన శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ కేంద్రం, శ్రీ సిటీ సెజ్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం లతో కూడి వున్నది. అలాగే 5 విశ్వ విద్యాలయాలు, అనేక కళాశాలతో కూడి ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా బాసిల్లుతున్నది. అంతే కాకుండా తిరుపతిలో స్విమ్స్, రుయా, బర్డ్ హాస్పిటల్, అనేక కార్పొరేట్ హాస్పిటళ్ళు ఉన్నందున జిల్లా వాసులే కాక ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిరోజూ వేలాది మంది వైద్య సదుపాయం కోసం వచ్చి వెళుతుంటారు, వీరందరిని దృష్టిలో పెట్టుకొని జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విధి నిర్వహణలో జిల్లా పోలీసులు దీక్షతో విధులు నిర్వహిస్తున్నామని సోమవారం నాడు శ్రీ పద్మావతి సావేరి కాన్ఫరెన్స్ హాల్ నందు వార్షిక నేరాల గణాంకాలపై ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించి జిల్లా ఎస్పీ యల్.సుబ్బరాయుడు, వివరాలను వెల్లడించారు.
తిరుపతి జిల్లా వార్షిక నేరాల వివరాలు…
పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో – నేర నియంత్రణ చర్యలు
దేహ సంబంధిత నేరాల (Bodily offences) లో 2023 లో 933 నేరాలు జరగగా 2024 లో 921 నేరాలు జరిగినాయి.
ఆస్తి సంబంధిత నేరాల (Property offences) లో 2023 లో 993 నేరాలు జరగగా 2024 లో 983 నేరాలు జరిగినాయి. రోడ్డు ప్రమాదాల (Road Accidents) లో 2023 లో 1039 ప్రమాదాలు జరగగా 2024 లో 1015 ప్రమాదాలు జరిగినాయి.
సైబర్ నేరాల (Cyber Crime) లో 2023 లో 173 నేరాలు జరగగా 2024 లో 248 నేరాలు జరిగినాయి.
వైట్ కాలర్ నేరాలు (White Collar Crime) లో 2023 లో 336 నేరాలు జరగగా 2024 లో 312 నేరాలు జరిగినాయి.
ఇతర IPC నేరాలు (Other IPC) లో 2023 లో 2651 నేరాలు జరగగా 2024 లో 2217 నేరాలు జరిగినాయి.
మొత్తంగా గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 7% శాతం మేరకు కేసులు తగ్గినాయి. సైబర్ క్రైమ్ నేరాలు నమోదు పెరిగాయి.
సైబర్ క్రైమ్:- 2023 NCRP (without FIR, FIR, Court order) ల ద్వారా నమోదైన సైబర్ కేసులలో ఇప్పటివరకు రూ.2,44,60,014/- ల నగదును సైబర్ నెరగాళ్లు దోచుకోగా రూ.84,08,392/- ల నగదును రికవరీ చేసి నేరుగా భాధితులకు రిఫండ్ చేయించడం జరిగింది.
2024 NCRP (without FIR, FIR, Court order) ల ద్వారా నమోదైన సైబర్ కేసులలో ఇప్పటివరకు రూ.12,89,28,136/- ల నగదును సైబర్ నెరగాళ్లు దోచుకోగా రూ.2,36,16,426/- ల నగదును రికవరీ చేసి నేరుగా భాధితులకు రిఫండ్ చేయించడం జరిగింది. ఈ MOBILEHUNTఅప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులలో ఇప్పటి వరకు రూ.7,56,40,000/- విలువ గల 4275 మొబైల్లను రికవరీ చేసి భాధితులకు అందజేశాము.
Best conviction in murders and POCSO cases – 2024:-
• తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 32/2022) లో నేరం నిరూపణ అయ్యి ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.1,000/- జరిమానా విధించడం జరిగినది.
• యస్.వి.యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసు (Cr.no. 68/2014), (Cr.no. 168/2022) లో నేరం నిరూపణ అయ్యి 02 ముద్దాయికి చనిపోవు వరకు జీవితకాల కఠిన కారాగార శిక్ష తో పాటు రూ.2,000/- జరిమానా విధించడం జరిగినది.